Friday, November 22, 2024
Homeసినిమారిషభ్ శెట్టి, నిత్య మీనన్, మానసి పరేఖ్ లకు జాతీయ అవార్డులు

రిషభ్ శెట్టి, నిత్య మీనన్, మానసి పరేఖ్ లకు జాతీయ అవార్డులు

కాంతారా సినిమాలో అద్భుత ప్రదర్శననకు గాను రిషభ్ శెట్టి జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు. ఉత్తమ నటి అవార్డును నిత్యా మీనన్ (తిరుచ్చి త్రయంబాల్) , మానసి పరేఖ్ (కచ్ ఎక్స్ ప్రెస్) లు సంయుక్తంగా అందుకోనున్నారు. మళయాళ సినిమా ‘ఆట్టం’ జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ఉత్తమ వినోదాత్మక చిత్రంగా కాంతారా అవార్డు గెల్చుకుంది. అమితాబ్ ప్రాధాన్ పాత్రలో నటించిన ఉంఛాయ్ సినిమాకు గాను సూరజ్ భార్జత్య ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకోనున్నారు. 7౦వ జాతీయ చలన చిత్ర అవార్డులను నేడు ప్రకటించారు.

  • ఉత్తమ హిందీ చిత్రం: గుల్ మొహర్
  • ఉత్తమ తెలుగు సినిమా: ‘కార్తికేయ 2’
  • ఉత్తమ కన్నడ చిత్రం: ‘కేజీఎఫ్ 2 ‘
  • ఉత్తమ తమిళ చిత్రం: ‘పీఎస్ 1’
  • ఉత్తమ సంగీత దర్శకుడు – ప్రీతమ్ (బ్రహ్మాస్త్ర)
  • ఉత్తమ నేపథ్య సంగీతం – ఏ ఆర్ రెహ్మాన్ (పీఎస్ 1)
  • ఉత్తమ కొరియో గ్రాఫర్ – జానీ మాస్టర్, సతీష్ కృష్ణన్ (తిరుచ్చి త్రంబలం)
  • ప్రత్యేక అవార్డు – మనోజ్ బాజ్ పేయి (గుల్ మొహర్)
  • ఉత్తమ యాక్షన్ డైరెక్టర్ – అంబరివ్ (కేజీఎఫ్ 2)
  • ఉత్తమ నేపథ్య గాయని – బాంబే జయశ్రీ (సౌదీ వెళ్లక్క సిసి)
  • ఉత్తమ నేపథ్య గాయకుడు – అరిజిత్ సింగ్ (బ్రహ్మాస్త్ర)
  • ఉత్తమ సహాయ నటి – నీనా గుప్తా (ఉంచాయ్)
  • ఉత్తమ సహాయ నటుడు – పవన్ రాజ్ మల్హోత్రా (ఫౌజా)

RELATED ARTICLES

Most Popular

న్యూస్