Saturday, March 14, 2026
HomeTrending Newsగుజరాత్‌లో రోడ్డు ప్రమాదం..పది మంది మృతి

గుజరాత్‌లో రోడ్డు ప్రమాదం..పది మంది మృతి

గుజరాత్‌లోని నవ్‌సారి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున నవ్‌సారి జిల్లా వెస్మా గ్రామ సమీపంలో బస్సు, కారు ఢీకొన్నాయి. దీంతో పది మంది దుర్మరణం చెందారు. దాదాపు 30 మంది గాయపడ్డారు. ప్రమాద ధాటికి కారు నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.

ప్రమాద సమయంలో కారులో ప్రయాణిస్తున్న 8 మంది అక్కడికక్కడే మృతిచెందారని, మరొకరు దవాఖానకు తరలిస్తుండగా మరణించారని పోలీసులు చెప్పారు. యాక్సిడెంట్‌ జరగడంతో బస్సు డ్రైవర్‌కు ఒక్కసారిగా గుండెపోటు వచ్చిందని, దీంతో అతడు కూడా అక్కడికక్కడే చనిపోయాడని తెలిపారు. బస్సులో ఉన్నవారంతా సూరత్‌లో జరిగిన ప్రముఖ్‌ స్వామి మహరాజ్‌ మహోత్సవ్‌కు హాజరై తిరిగి సొంతూళ్లకు వెళ్తున్నారని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular