Thursday, March 19, 2026
HomeTrending Newsకులు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 16 మంది మృతి

కులు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 16 మంది మృతి

హిమాచల్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కులు జిల్లాలోని నియోలి – షంషేర్ రోడ్డులో ఈ రోజు ఉదయం 8.30 సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సుమారు 16 మంది మృతి చెందారు. కులు జిల్లాలోని జంగ్లా సమీపంలో జరిగిన ఈ దుర్ఘటన జరగగా.. చనిపోయిన వారిలో ఎక్కువగా మహిళలు, పాటశాల విద్యార్తులే ఉన్నారు. సైన్జ్ వైపు వెళ్తుండగా ప్రైవేటు బస్సు అదుపు తప్పి లోయలో పడిందని ప్రాథమిక సమాచారం.

ప్రమాద సమయానికి బస్సులో సుమారు 45 మంది ప్రయాణిస్తున్నారని, క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలిస్తున్నారు. బియాస్ నది ఉదృతంగా ప్రవహిస్తుండటంతో ఘటనా స్థలానికి చేరుకోవటం సహాయక బృందాలకు ఇబ్బందికరంగా మారింది. ప్రమాదంలో బస్సు పూర్తిగా దెబ్బతిన్నది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular