Tuesday, March 10, 2026
Homeస్పోర్ట్స్రెండు సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలు- ఇండియా 473/8

రెండు సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలు- ఇండియా 473/8

ధర్మశాల వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతోన్న ఐదో టెస్టులో ఇండియా భారీ స్కోరు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ లు సెంచరీలతో కదం తొక్కగా, దేవదత్ పడిక్కల్, సర్ఫ్ రాజ్ ఖాన్ లు అర్ధ సెంచరీలతో సత్తా చాటారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్లు కోల్పోయి 473 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్ లో 255 రన్స్ ఆధిక్యం సంపాదించింది.

ఒక వికెట్ నష్టానికి 135 పరుగులతో నేడు రెండోరోజు ఆట ఇండియా మొదలు పెట్టింది. రోహిత్-గిల్ లు రెండో వికెట్ కు 171 పరుగులు జోడించారు. టెస్ట్ కెరీర్ రో 12వ సెంచరీ పూర్తి చేసిన రోహిత్ శర్మ 103 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బెన్ స్టోక్స్ బౌలింగ్ లో బౌల్డ్ గా వెనుదిరిగాడు. కాసేపటికే గిల్ కూడా 110 రన్స్ చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత పడిక్కల్-సర్ఫ్ రాజ్ లు నాలుగో వికెట్ కు 97 రన్స్ భాగస్వామ్యం నెలకొల్పారు. సర్ఫ్ రాజ్-56; పడిక్కల్-65 రన్స్ చేసి ఔట్ కాగా, రవీంద్ర జడేజా, ధృవ జురెల్ లు చెరో 15 పరుగులు చేసి పెవిలియన్ చేరారు.

రెండో రోజు ఆట ముగిసే సమయానికి కుల్దీప్-27; బుమ్రా-19 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో షోహిబ్ బషీర్ 4; టామ్ హార్ట్ లీ 2; అండర్సన్, స్టోక్స్ చెరో వికెట్ సాధించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular