Saturday, March 7, 2026
Homeస్పోర్ట్స్T20 ఫార్మాట్ కు రోహిత్, విరాట్ గుడ్ బై

T20 ఫార్మాట్ కు రోహిత్, విరాట్ గుడ్ బై

టీమిండియా స్టార్లు రోహిత్ శర్మ,  విరాట్ కోహ్లి T20లకు రిటైర్మెంట్ ప్రకటించారు. సౌతాఫ్రికాపై వరల్డ్ కప్ ఫైనల్లో విజయం సాధించిన అనంతరం వీరు ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.

‘ఇదే నా చివరి వరల్డ్ కప్. T20 మ్యాచ్ కూడా. తర్వాతి తరానికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో నేను వెనక్కి తగ్గుతున్నా’ అంటూ మ్యాచ్ గెలిచిన అనంతరం పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ ప్రసంగంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

టి 20లకు రిటైర్మెంట్ ప్రకటించడానికి ఇది సరైన సమయమని భావిస్తున్నానని రోహిత్ వెల్లడించాడు. వన్డే, టెస్టుల్లో కొనసాగుతానని పేర్కొన్నారు.  నా కెరీర్ ఈ ఫార్మాట్తో ప్రారంభమైంది. ఈ కప్ గెలవాలనే నా కోరిక నెరవేరింది’ అని మ్యాచ్ ప్రెజెంటేషన్ అనంతరం జరిగిన ప్రెస్ మీట్ లో  తన నిర్ణయాన్ని ప్రకటించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular