Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్IND Vs. Eng: రోహిత్, జడేజా సెంచరీలు - ఇండియా 326/5

IND Vs. Eng: రోహిత్, జడేజా సెంచరీలు – ఇండియా 326/5

ఇంగ్లాండ్ తో నేడు మొదలైన మూడో టెస్ట్ తొలిరోజు ఇండియా పైచేయి సాధించింది.  కెప్టెన్ రోహిత్ శర్మ, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాలు సెంచరీలతో కదంతొక్కారు.  ఈ మ్యాచ్ తోనే టెస్టుల్లో ఆరంగ్రేటం చేసిన సర్ఫరాజ్ ఖాన్ తొలి మ్యాచ్ లోనే సత్తా చాటి 66  బంతుల్లో  9 ఫోర్లు, 1 సిక్సర్ తో 62 పరుగులు చేశాడు.

రాజ్ కోట్ లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుతుతోన్న ఈ మ్యాచ్ లో… టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా 33 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. యశస్వి జైస్వాల్-10; రజత్ పటీదార్-5 పరుగులే చేయగా శుభ్ మన్ గిల్ డకౌట్ గా వెనుదిరిగాడు. ఈ దశలో రోహిత్ శర్మ- జడేజాలు బాధ్యతాయుతంగా ఆడి 204 పరుగుల రికార్డు భాగస్వామ్యంతో ఇన్నింగ్స్ ను  చక్కదిద్దారు. 196 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 131 పరుగులు చేసిన రోహిత్ శర్మ నాలుగో వికెట్ గా వెనుదిరిగాడు ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సర్ఫరాజ్ ఖాన్, జడేజా తో కలిసి స్కోరుబోర్డును పరుగులెత్తించాడు. 48 బంతుల్లోనే 7 ఫోర్లు, ఒక సిక్సర్ తో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ధాటిగా ఆడుతున్న సమయంలో లేని పరుగుకోసం ప్రయత్నించి జట్టు స్కోరు 31 7వద్ద ఔటయ్యాడు. జడేజా 198 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

మొదటి రోజు ఆట ముగిసే సమయానికి జడేజా-110; కుల్దీప్ యాదవ్ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు.

ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్ వుడ్ మూడు వికెట్లతో రాణించగా, టామ్ హార్ట్ లీ కి ఒక వికెట్ దక్కింది.

ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్-ఇండియా చెరో మ్యాచ్ గెలిచి 1-1తో సిరీస్ సమంగా ఉంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్