Sunday, September 8, 2024
HomeTrending Newsఅవి పగటి కలలే: రోజా

అవి పగటి కలలే: రోజా

Day Dreams: ఈ మహానాడుతో ఎన్టీఆర్ ఆత్మ మరోసారి క్షోభించిందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కీ రోజా  అన్నారు. కనీసం ఈ మహానాడులోనైనా తనకు వెన్నుపోటు పొడిచినందుకు  చంద్రబాబు బహిరంగంగా క్షమాపణ చెబుతారని పై లోకంలో ఉన్న ఎన్టీఆర్  ఆత్మ కోరుకుని ఉంటుందని, కానీ అలా జరగలేదని రోజా ఆవేదన వ్యక్తం చేశారు. నాడు ఎన్టీఆర్ మరణానికి కారణమైన వారే నేడు ఆయనకు దండలు వేసి దండాలు పెడుతుంటే ఆశ్చర్యంగా ఉందన్నారు.  మహానాడులో ఆత్మ విమర్శ చేసుకొని, చేసిన తప్పులను సరిదిద్దుకొని, పార్టీ ఎందుకు ఇలా అయ్యిందో చర్చించుకుంటారని భావించామని, కానీ సిఎం జగన్ ను తిట్టడానికి, తిట్టించడానికి మాత్రమే పరిమితమయ్యారని రోజా విమర్శించారు.

చంద్రబాబు 14 ఏళ్ళపాటు ముఖ్యమంత్రిగా ఉన్నారని, కనీసం ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో అయన పేరిట ఓ స్మృతి వనం కూడా ఏర్పాటు చేయలేకపోయారని రోజా ఎద్దేవా చేశారు. నేడు నిమ్మకూరులో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ… ఇప్పుడు విగ్రహం ఏర్పాటు చేసి పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, ఇప్పటిదాకా ఏం చేశారని ప్రశ్నించారు.   మూడేళ్ళ జగన్ పాలనలో సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందిస్తున్నామని, టిడిపి-జనసేన, బిజెపి కార్యకర్తలు కూడాలబ్ధి పొంతుడున్నారని రోజా వివరించారు.

తమ పార్టీని గాలి పార్టీ అంటూ అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై రోజా మండిపడ్డారు. ఫ్యాన్ గాలి దెబ్బకు లోకేష్, బాబులు పిచ్చెక్కి తిరుగుతున్నారని, తిరుపతిలో టిడిపిపై మీరేం మాట్లాడారో మర్చిపోయారా అంటూ ప్రశ్నించారు.  తెలుగుదేశం పార్టీకి 30నియోజక వర్గాల్లో అభ్యర్ధులు లేరని స్వయంగా ఆ పార్టీ నేత లోకేష్ చిట్ చాట్ లో ఒప్పుకున్నారని, ఆయనే ఈ అంకె చెబితే ఇంకెన్ని స్థానాల్లో లేరో అనేది ఆలోచించాలన్నారు. ఇలాంటప్పుడు టిడిపి 160 సీట్లు వస్తాయని అచ్చెన్నాయుడు చెప్పడం విడ్డూరంగా ఉందని,  అధికారంలోకి వస్తామంటూ పగటి కలలు కంటున్నారని రోజా వ్యాఖ్యానించారు.

Also Read : అది మహానాడు కాదు…: తమ్మినేని 

RELATED ARTICLES

Most Popular

న్యూస్