అది మహానాడు కాదు…: తమ్మినేని

టిడిపి జరుపుకుంటున్నది మహానాడు కాదని వల్లకాడు అని అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మండిపడ్డారు. కుళ్ళి కంపుకొడుతున్న శవానికి ఇప్పుడు అంతిమ సంస్కారాలు చేస్తున్నట్లు ఉందని వ్యాఖ్యానించారు.  సామాజిక న్యాయ భేరి బస్సుయాత్ర రెండోరోజు విశాఖలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో అయన ప్రసంగించారు.

మూడేళ్ళుగా వెనుకబడిన వర్గాలకు సామాజిక న్యాయం చేసుకుంటూ జగన్ ప్రభుత్వం ముందుకు వెళుతుంటే ఓర్చుకోలేకపోతున్నారని విమర్శించారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెడితే తట్టుకోలేక పోతున్నారని… చంద్రబాబుకు ఎందుకు అంత దుగ్ధ, కడుపు మంట అని స్పీకర్ ప్రశ్నించారు.  ప్రభుత్వమే బాధ్యత వహించాలన్న పవన్ వ్యాఖ్యలపై కూడా తమ్మినేని తపుబట్టారు. మీకు బాధ్యత లేదా అని నిలదీశారు. నవరత్నాలతో పాటు మరో 33 పథకాలు ప్రజలకు అందిస్తున్నారని,  వీటిలో కూడా దళారీలకు, మధ్యవర్తులకు ఆస్కారమే లేకుండా నేరుగా లబ్ధిదారుదికే ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా ఇస్తున్నారని, అవినీతిపరుల చేతులు నరికి వేయబడ్డాయని వివరించారు. గతంలో జన్మభూమి కమిటీల పేరుతో టిడిపి నాయకులు చేసిన ఆగడాలు ఇంకా జనం మర్చిపోలేదన్నారు.

తరాలుగా నిద్రాణమై ఉన్న వెనుకబడినవర్గాలను గుర్తించి వారికి రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తున్న  సిఎం జగన్ కు మనమంతా అండగా ఉందామని, ఏమాత్రం ఏమరుపాటు వద్దని తమ్మినేని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Also Read : త్యాగాలకు సిద్ధం కావాలి : నరేంద్ర 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *