Monday, June 8, 2026
Homeసినిమా'..వీర‌మ‌ల్లు'పై ప‌వ‌న్ అసంతృప్తి నిజ‌మేనా?

‘..వీర‌మ‌ల్లు’పై ప‌వ‌న్ అసంతృప్తి నిజ‌మేనా?

Veera Mullu: వ‌కీల్ సాబ్, భీమ్లా నాయ‌క్ సినిమాలతో అభిమానులను అలరించారు.  ప్ర‌స్తుతం విభిన్న క‌థా చిత్రాల ద‌ర్శ‌కుడు క్రిష్ రూపొందిస్తున్న ‘హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు‘ లో పవన్ నటి స్తున్నారు. సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ ఏ.ఎం.ర‌త్నం దీన్ని నిర్మిస్తున్నారు.

అయితే… ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన షూటింగ్ తో ప‌వ‌న్ అసంతృప్తిగా ఉన్నార‌ని.. అందుక‌నే ఈ సినిమా షూటింగ్ ఆపేసార‌ని వార్త‌లు వ‌చ్చాయి. దీంతో ఇది నిజ‌మేనా..?  నిజంగానే ప‌వ‌న్ అసంతృప్తిగా ఉన్నారా..? అనేది ఆస‌క్తిగా మారింది. సోష‌ల్ మీడియాలో దీని గురించే చ‌ర్చ జ‌రుగుతోంది. అస‌లు ఏం జ‌రిగింద‌ని ఆరా తీస్తే.. తెలిసింది ఏంటంటే… ప‌వ‌న్ క‌ళ్యాణ్ పాలిటిక్స్ లో బిజీగా ఉండ‌డం వ‌ల‌న షూటింగ్ కి బ్రేక్ ఇచ్చార‌ని తెలిసింది.

జూన్ 7 నుంచి జూన్ 27 వ‌ర‌కు తాజా షెడ్యూల్ స్టార్ట్ చేయ‌నున్నార‌ని టాక్ వినిపిస్తోంది. హైద‌రాబాద్ లో ప్ర‌త్యేకంగా వేసిన భారీ సెట్స్ లో కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించేందుకు ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఈ షెడ్యూల్ పూర్తైన త‌ర్వాత రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇస్తార‌ని స‌మాచారం. మ‌రి.. వీర‌మ‌ల్లు ద‌స‌రాకి వ‌స్తాడో… సంక్రాంతికి వ‌స్తాడో చూడాలి.

Also Read : లక్ష్యం మార్చుకున్న వీర‌మ‌ల్లు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular