Monday, June 8, 2026
HomeTrending Newsత్యాగాలకు సిద్ధం కావాలి : నరేంద్ర

త్యాగాలకు సిద్ధం కావాలి : నరేంద్ర

Sacrifise:  పార్టీ సీనియర్లు త్యాగానికి సిద్ధపడాలని పార్టీ నేత ధూళిపాళ నరేంద్ర విజ్ఞప్తి చేశారు. తాను కూడా త్యాగానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఒంగోలులో మహానాడు సందర్భంగా అయన ఈ వ్యాఖ్యలు చేశారు. పార్టీలో యువతకు ప్రాధాన్యం ఇచ్చి వారి నాయకత్వాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.

మూడేళ్ళుగా జగన్ ప్రభుత్వ అరాచకాలను ధీటుగా ఎదుర్కొని కార్యకర్తలు ముందుకు సాగారని, ఇలాంటి  ప్రభుత్వాన్ని సాగనంపడానికి కలిసి వచ్చే పార్టీలతో పొత్తులు పెట్టుకుంటే తప్పేమిటని అయన ప్రశ్నించారు.  జగన్ ప్రజాస్వామ్య వ్యవస్థలను విధ్వంసం చేశారని నరేంద్ర విమర్శించారు.

ఇటీవల కార్యకర్తలు చెప్పినట్లు  చివరి నిమిషంలో కాకుండా ముందుగానే టిక్కెట్లు ప్రకటించాలని అభిప్రాయపడ్డారు.  ఈ మహానాడుకు ఎంతో ప్రాముఖ్యత ఉందని, తెలుగుజాతి ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచిన టిడిపి వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఈ వేడుక జరుగుతోందని నరేంద్ర వివరించారు. టిడిపి వచ్చిన తరువాతే రాష్ట్రంలో సామాజిక, సాంఘీక విప్లవం వచ్చిందని గుర్తు చేశారు.

Also Read : త్యాగాలకు సిద్ధం కావాలి : నరేంద్ర 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular