Thursday, March 28, 2024
Homeసినిమాన‌వంబ‌ర్ 26న ‘ఆహా’లో ‘రొమాంటిక్‌’

న‌వంబ‌ర్ 26న ‘ఆహా’లో ‘రొమాంటిక్‌’

Romantic on Aha:
100 పర్సెంట్ తెలుగు ఓటీటీ మాధ్య‌మం ఆహా ఇప్పుడు తెలుగు వారి ఇంట ఎంట‌ర్‌టైన్‌మెంట్‌లో భాగ‌మైంది. ఈ మాధ్య‌మం అందిస్తున్న చిత్రాల్లో ఆకాశ్ పూరి, కేతికా శ‌ర్మ జంట‌గా న‌టించిన యాక్ష‌న్‌, రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘రొమాంటిక్‌’ న‌వంబ‌ర్ 26న ప్రేక్షకుల‌ను మెప్పించ‌నుంది. ఈ సినిమాకు క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌ల‌ను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ అందించారు. అనిల్ పాడూరి ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యారు. ఆకాశ్ పూరి, కేతికా శ‌ర్మ‌ల‌తో పాటు సూప‌ర్బ్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో ర‌మ్య‌కృష్ణ పెర్ఫామెన్స్ సినిమాకు మెయిన్ హైలైట్.

వీటితో పాటు ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్‌, షార్ప్ స్క్రీన్‌ప్లే, సునీల్ క‌శ్య‌ప్ అందించిన అద్భుత‌మైన సంగీతం ఆడియెన్స్‌ ను అల‌రిస్తాయి. గోవాలోని వాస్కోడిగామా అనే 21 ఏళ్ల కుర్రాడి క‌థ‌. గోవాలో జ‌రిగే నేరాల‌కు పోలీసులు అత‌న్ని ఇబ్బంది పెడుతుంటారు. కూడా. అత‌ని జీవితంలో స‌మ‌స్య‌లే ఎక్కువ‌గా వ‌స్తుంటాయి. త‌నొక గ్యాంగ్‌స్ట‌ర్‌గా మారుతాడు. పోలీస్ ఆఫీస‌ర్ చెల్లెలు మోనిక‌తో ప్రేమ‌లో ప‌డ‌తాడు. ఇద్ద‌రివి విరుద్ధ‌మైన ప్ర‌పంచాలు అయినా కూడా ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ పుడుతుంది. ఏసీపీ ర‌మ్యా గోవార్క‌ర్ వారి ప్రేమ‌కు ఫుల్‌స్టాప్ పెట్ట‌డానికి వ‌స్తుంది.

ఆకాశ్ పూరి, కేతికా శ‌ర్మ మ‌ధ్య అద్బుత‌మైన కెమిస్ట్రీ ఆడియెన్స్‌ ను ఆక‌ట్టుకుంటుంది. దీంతో పాటు గ్యాంగ్‌స్ట‌ర్స్ క‌థ‌నాన్ని కూడా సినిమాలో పూరీ జ‌గ‌న్నాథ్ భాగం చేశారు. యాక్ట‌ర్ ఉత్తేజ్‌తో సునైన కామెడీ ప్రేక్ష‌కుల‌ను న‌వ్విస్తుంది. సునీల్ క‌శ్య‌ప్ సంగీతం సినిమాను మ‌రో లెవ‌ల్‌కు తీసుకెళ్లింది. స‌తీశ్ సారిప‌ల్లి, సీనియ‌ర్ న‌టి ర‌మా ప్ర‌భ‌, ముఖేష్ దేశ్‌పాండే ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో మెప్పించారు. తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో భాగ‌మైన ఆహా న‌వంబ‌ర్ 26న ఆహాలో ప్రీమియ‌ర్ కానుంది.

Also Read : రొమాంటిక్ బ్లాక్ బస్టర్ హిట్ : కేతిక శర్మ ధీమా

RELATED ARTICLES

Most Popular

న్యూస్