Tuesday, June 16, 2026
Homeసినిమారోషన్ న్యూ మూవీ టైటిల్ ‘ఛాంపియన్’

రోషన్ న్యూ మూవీ టైటిల్ ‘ఛాంపియన్’

వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ తమ ప్రొడక్షన్ నంబర్ 9 గా యువ హీరో రోషన్ ప్రధాన పాత్రలో ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. జాతీయ అవార్డు గ్రహీత ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సి అశ్వనీదత్ భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. రోషన్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ.. మేకర్స్ సినిమాలో అతని లుక్‌ను రివీల్ చేయడంతో పాటు టైటిల్‌ను అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి ‘ఛాంపియన్‌’ అనే ఆసక్తికరమైన టైటిల్ పెట్టారు. రోషన్ ఈ పోస్టర్‌లో పొడవాటి జుట్టు, లైట్ గడ్డంతో చాలా అందంగా కనిపిస్తున్నాడు. టైటిల్ లోగో పై రెండు వైపులా రెక్కలతో ఫుట్‌బాల్ ఉంది.

‘పెళ్లి సందడి’ సినిమాతో అందరినీ మెప్పించిన రోహన్ ఛాంపియన్‌లో విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రదీప్ అద్వైతం రోషన్‌ను కొత్త అవతార్‌లో ప్రెజెంట్ చేయడానికి విన్నింగ్ స్క్రిప్ట్‌ను రాశారు.ఈ చిత్రంలో ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. ఈ చిత్రానికి సుధాకర్ రెడ్డి యక్కంటి సినిమాటోగ్రాఫర్ కాగా, మెలోడీ స్పెషలిస్ట్ మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. మరిన్ని వివరాలు త్వరలో ప్రకటించనున్నారు. మరి.. పెళ్లిసందడి సినిమాతో సక్సెస్ సాధించిన రోషన్ ఛాంపియన్ మూవీతో కూడా విజయం సాధిస్తాడేమో చూడాల

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular