Wednesday, June 17, 2026
Homeసినిమా'కేజీఎఫ్' ను క్రాస్ చేసిన 'ఆర్ఆర్ఆర్'

‘కేజీఎఫ్’ ను క్రాస్ చేసిన ‘ఆర్ఆర్ఆర్’

ఎన్టీఆర్, రామ్ చరణ్‌, రాజమౌళిల క్రేజీ కాంబినేషన్లో రూపొందిన సంచలన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. బాహుబలి తర్వాత రాజమౌళి నుంచి వచ్చిన సినిమా కావడంతో ఆర్ఆర్ఆర్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఆర్ఆర్ఆర్ ఆకట్టుకుని బాక్సాఫీస్ దగ్గర 1200 కోట్లు సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అంతే కాకుండా.. గోల్డన్ గ్లోబ్ అవార్డ్ అందుకుని చరిత్ర సృష్టించింది. అలాగే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డ్ అందుకుని మరోసారి చరిత్ర సృష్టించింది.

ఇప్పుడు ఆర్ఆర్ఆర్ మరో రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రం జపాన్ లో ఇప్పటి వరకూ 81 కోట్ల రూపాయల కి పైగా వసూళ్లను రాబట్టింది. దీంతో వరల్డ్ వైడ్ గా 1236 కోట్ల రూపాయల వసూళ్లు చేసింది. ‘కేజీఎఫ్ 2’ చిత్రం 1233 కోట్ల రూపాయల తో గతేడాది టాప్ గ్రాసర్ గా నిలిచింది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ ఆ ప్లేస్ ను భర్తీ చేసింది. ఇంకా జపాన్ లో ఆర్ఆర్ఆర్ మూవీ రికార్డు కలెక్షన్స్ వసూలు చేస్తుండడం విశేషం. రజనీకాంత్ ‘ముత్తు’ రికార్డ్ ను క్రాస్ చేయడమే కాదు.. ఇప్పట్లో ఎవరూ క్రాస్ చేయలేనట్టుగా 81 కోట్లు వసూలు చేసి 100 కోట్ల దిశగా అడుగులు వేస్తుంది.

మరో వైపు ఆర్ఆర్ఆర్ మూవీ ఇండియా తరుపున అధికారికంగా ఆస్కార్ ఎంట్రీకి వెళ్లకపోయినా.. డైరెక్ట్ గా ఆస్కార్ ఎంట్రీ సాధించింది. ఆస్కార్ అవార్డ్ గెలుచుకుంది. దేశం తరుపున ఆస్కార్ ఎంట్రీకి వెళ్లకపోయినా.. అవార్డు సాధించవచ్చు అని రాజమౌళి చేసి చూపించారు. ఇంకా పలు ఇంటర్నేషనల్ అవార్డులను సైతం గెలుచుకోబోతుంది. ఆర్ఆర్ఆర్ ఈ రేంజ్ సక్సెస్ సాధించడంతో రాజమౌళి నెక్ట్స్ మహేష్ బాబుతో చేసే సినిమాతో మరోసారి సంచలన విజయం సాధించడం.. చరిత్ర సృష్టించడం ఖాయమనే టాక్ బలంగా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular