Thursday, March 28, 2024
Homeసినిమా'బాహుబ‌లి-2' రికార్డ్ క్ చేసిన 'ఆర్ఆర్ఆర్'

‘బాహుబ‌లి-2’ రికార్డ్ క్ చేసిన ‘ఆర్ఆర్ఆర్’

Records Break: యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళిల క్రేజీ కాంబినేష‌న్లో రూపొందిన సంచ‌ల‌న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా ప్రారంభం నుంచి బాహుబ‌లి 2 రికార్డ్ ను క్రాస్ చేస్తుందా..?  లేదా..? అనేది ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. అయితే.. అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగానే ఆర్ఆర్ఆర్ మూవీకి రికార్డు స్థాయిలో భారీ ఓపెనింగ్స్ వ‌చ్చాయి కానీ.. టాక్ కాస్త డివైడ్ గా రావ‌డంతో ఏ రేంజ్ లో క‌లెక్ష‌న్స్ వ‌స్తాయి అనేది ఆస‌క్తిగా మారింది.

ఆర్ఆర్ఆర్ ఫ‌స్డ్ డే క‌లెక్ష‌న్ ఎంత అనేది అధికారికంగా ప్ర‌క‌టించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ 27.5 కోట్లు, నైజాం 14.5 కోట్లు, కర్నాట‌క 14.5 కోట్లు, త‌మిళ‌నాడు 10 కోట్లు, కేర‌ళ 4 కోట్లు, నార్త్ ఇండియా 25 కోట్లు.. ఇండియాలో మొత్తంగా 156 కోట్లు సాధించ‌గా యు.ఎస్.ఎ 42 కోట్లు, నాన్ యు.ఎస్ 25 కోట్లు అన్ని క‌లిపి వ‌ర‌ల్డ్ వైడ్ గా 223 కోట్లు క‌లెక్ట్ చేసింది. ఈ విధంగా బాహుబ‌లి 2 ఫ‌స్ట్ డే రికార్డ్ ను ఆర్ఆర్ఆర్ మూవీ క్రాస్ చేసి స‌రికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. మ‌రి.. ఫుల్ ర‌న్ లో బాహుబ‌లి 2 ని ఆర్ఆర్ఆర్ క్రాస్ చేస్తుందో లేదో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్