Sunday, January 19, 2025
Homeసినిమానేను మీ నాన్నకు ఫ్యాన్ ను : అమీర్

నేను మీ నాన్నకు ఫ్యాన్ ను : అమీర్

Thanks Amir! యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళిల క్రేజీ కాంబినేష‌న్లో రూపొందిన భారీ బ‌డ్జెట్ మూవీ ఆర్ఆర్ఆర్. ఈ మూవీని ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి అటు నంద‌మూరి అభిమానులు ఇటు మెగా అభిమానులే కాకుండా.. సామాన్య ప్రేక్ష‌కులు సైతం ఆర్ఆర్ఆర్ మూవీ విడుద‌ల కోసం ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. మార్చి 25న ఆర్ఆర్ఆర్ మూవీ ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.
ఈ సంద‌ర్భంగా చిత్ర‌యూనిట్ ప్ర‌మోష‌న్స్ లో స్పీడు పెంచింది. ఈ మేర‌కు ఢిల్లీలో నిర్వహించిన ఈవెంట్ కి బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ను చీఫ్ గెస్ట్ గా పిలవడం జరిగింది. ఈ వేడుకలో రామ్ చ‌ర‌ణ్ మాట్లాడుతూ… చాలా సంవ‌త్స‌రాల క్రితం నుంచి అమీర్ ఖాన్ కి ఫ్యాన్ ని అని చెప్పారు. అప్పుడు అక్క‌డే ఉన్న అమీర్ ఖాన్ స్పందిస్తూ.. నువ్వు నా ఫ్యాన్ కాక ముందు నుంచే నేను మీ నాన్నకి ఫ్యాన్ ని చెప్పారు.  అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.

అయితే.. అమీర్ ఖాన్ ఈవెంట్ కి హాజరు కావడం పట్ల చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తూ థాంక్స్ తెలియ‌చేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఈ ఈవెంట్ కు సంబంధించిన ఒక ఫోటో ను షేర్ చేయడం జరిగింది. ఆ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్