Shaking Social Media: సూప‌ర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ‘సర్కారు వారి పాట‘. ఈ చిత్రానికి గీత గోవిందం ఫేమ్ ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇందులో మ‌హేష్ స‌ర‌స‌న మల‌యాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ న‌టిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన కళావతి పాట యూట్యూబ్‌ను షేక్ చేసింది. ఇప్పుడు తాజాగా రెండో పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది. పెన్నీ అంటూ సాగే లిరికల్ పాట విడుదలైన కొద్ది సేపటికే
సోషల్ మీడియాలో ట్రెండ్ గా మారింది.

ఈ పాటలో మహేష్ బాబు ముద్దుల కూతురు సితార డ్యాన్స్ చేయ‌డం విశేషం. సితార డ్యాన్స్‌ తో  మ‌హేష్ అభిమానులు తెగ సంతోష‌ప‌డుతున్నారు. అటు మహేష్‌ కూడా ఈ పాటలో చాలా క్యూట్‌గా కనిపిస్తున్నాడు. అతడి డ్యాన్స్ కూడా అభిమానులను విశేషంగా అలరిస్తోంది. మ్యూజిక్ డైరెక్ట‌ర్ తమన్ సంగీతం కూడా అలరిస్తోంది.

మొత్తానికి రిలీజ్ చేసిన రెండు పాట‌లు యూట్యూబ్ ని షేక్ చేస్తూ.. సినిమా పై అంచ‌నాల‌ను రెట్టింపు చేశాయి. మ‌హేష్‌, సితార స్టెప్పులు సూపర్ గా ఉండ‌డంతో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. కాగా మే 12న సర్కారు వారి పాట మూవీ థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *