Monday, March 16, 2026
Homeసినిమా‘రుద్రాక్షపురం’ టైటిల్ పోస్టర్ విడుదల

‘రుద్రాక్షపురం’ టైటిల్ పోస్టర్ విడుదల

పీఆర్వో వీరబాబు ప్రధాన పాత్రలో టెన్ ట్రీస్ ఫిలిం ప్రొడక్షన్ హౌస్ పతాకం పై కనకదుర్గ రాజు నిర్మిస్తున్న చిత్రం ‘రుద్రాక్షపురం’. ఈ చిత్ర టైటిల్ లుక్ పోస్టర్‌ను విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ విడుదల చేసి, ఈ చిత్ర టైటిల్ విభిన్నంగా ఉందని, కొత్తదనంతో కూడిన ఈ చిత్రం విజయవంతం కావాలని శుభాశీస్సులు అందించారు. ఈ టైటిల్ లుక్ లాంచ్ కార్యక్రమంలో నిర్మాత సురేశ్ కొండేటి, నటులు హేమ, రమణారెడ్డి, నటుడు, డిస్టిబ్యూటర్ రాఘవేంద్ర, అశోక్ మున్నూర్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

“అనంతపురం జిల్లా ‘రుద్రాక్షపురం’ ఫారెస్టులో 2018‌లో జరిగిన ఓ యధార్థ సంఘటనను ఆధారంగా తీసుకొని దర్శకుడు ఆర్.కె. గాంధీ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.ఆయన కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంలో వహిస్తున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. మంచి సాంకేతిక వర్గం కుదిరింది. పీఆర్వో వీరబాబు ఓ ప్రముఖ పాత్రలో నటిస్తున్నారు’’ అని నిర్మాత కనకదుర్గరాజు తెలుపగా “ఈ చిత్రం సినీ పరిశ్రమ నేపథ్యంలో సాగే కథనంతో హారర్ థ్రిల్లర్ జోనర్‌లో సాగుతుంది. అక్టోబర్ 12 నుండి అనంతపురం, కర్నూల్ ప్రాంతాల్లో షూటింగ్ ప్రారంభిస్తాం” అని దర్శకుడు ఆర్ కె గాంధీ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular