Saturday, November 23, 2024
HomeTrending Newsయుద్దానికి తాత్కాలిక విరామం

యుద్దానికి తాత్కాలిక విరామం

క్రెమ్లిన్  సైనిక సంపత్తిని ప్రదర్శించెందుకా అన్నట్టు ఉక్రెయిన్ లో  బీభత్సం సృష్టిస్తున్న రష్యా తాత్కాలికంగా కాల్పుల విరమణ ప్రకటించింది. మాస్కో కాలమానం ప్రకారం శనివారం ఉదయం 11 గంటల నుంచి కాల్పుల విరమణ ప్రారంభమయింది. తాత్కాలిక కాల్పుల విరమణ సుమారు ఐదున్నర గంటలపాటు అమలవుతుంది. ఉక్రెయిన్ లోని మరియుపోల్, వోల్నవఖ నగరాల్లో పౌరులను తరలించేందుకు, సహాయ కార్యమాలు నిర్వహించేందుకు అవకాశం కల్పించింది. ఈమేరకు రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని రష్యా ఆదేశించింది.

రష్యా గుప్పిట్లో ఉన్న ఈ రెండు నగరాల్లో  ప్రజలకు కొద్ది రోజులుగా ఆహారం, తాగునీరు, విద్యుత్, హీటింగ్, రవాణ సదుపాయాలను రష్యా సేనలు నిలిపివేశాయి. ప్రపంచ దేశాల నుంచి వస్తోన్న ఒత్తిడి మేరకు రష్యా ఈ తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించినట్టు తెలుస్తోంది. ఉత్తర దృవం నుంచి వస్తున్న శీతల గాలులతో ఉక్రెయిన్ లో చలి తీవ్రత అధికంగా ఉంది.  రష్యా దాడులతో విద్యుత్ సరఫరా నిలిచిపోయి ప్రజలు జీవన్మరణ స్థితిలో ఉన్నారు, ఓ వైపు ఆహార పదార్థాల కొరత, మరోవైపు విద్యుత్తు కోతలతో వృద్దులు అనేక మంది మృత్యువాత పడ్డారని మనవ హక్కుల సంస్థలు వెల్లడించాయి.

రష్యా కాల్పుల విరమణ ప్రకటించినా ఉక్రెయిన్ కు చెందిన కీలక అధికారులు బయటకు రావటం లేదు. ఈ సమయంలో ఎవరైనా బయటకు వస్తే వారి కదలికలు తెలుసుకొని రష్యా తిరిగి వారిని అదుపులోకి తీసుకోవటమో, అదును చూసి దాడులు చేయటమో చేస్తుందని ఉక్రెయిన్ ప్రభుత్వం అనుమానిస్తోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్