Saturday, January 18, 2025
HomeTrending Newsరష్యాపై యూరోప్ దౌత్య యుద్ధం

రష్యాపై యూరోప్ దౌత్య యుద్ధం

రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో యూరోప్ దేశాలు రష్యాపై ఒత్తిడి మరింత ముమ్మరం చేశాయి. ఓ వైపు ఇస్తాంబుల్ లో చర్చలు జరుగుతుండగానే మరోవైపు రష్యాను దారిలోకి తెచ్చే పనిలో పడ్డాయి. ఇప్పటివరకు ఆంక్షలతో  సరిపెట్టిన దేశాలు ఇప్పుడు రాయబారులను, దౌత్య సిబ్బందిని తమ దేశం నుంచి వెళ్ళిపోవాలని హుంకరిస్తున్నాయి. రష్యా దౌత్య సిబ్బంది గూడచర్యానికి పాల్పడుతున్నారని ఆయా దేశాలు ఆరోపిస్తున్నాయి. రష్యా రాయబారుల ముసుగులో 17 మంది నిఘా అధికారులు తమ దేశంలో గుర్తించామని వారందరిపై వేటు వేసినట్టు నెదర్లాండ్స్ ప్రకటించింది. బెల్జియంలో 21 మంది రష్యా అధికారులను వెనక్కి పంపారు. మూడు రోజుల్లో దేశం విడిచి వెళ్ళిపోవాలని రష్యా రాయబార కార్యాలయ సిబ్బందికి చెక్ రిపబ్లిక్ అల్టిమేటం ఇచ్చింది. ఐర్లాండ్ నలుగురు సిబ్బందిపై  బహిష్కరణ వేటు వేసింది.

రష్యా దౌత్య సిబ్బందిని నాటో ఇప్పటికే తిప్పి పంపింది. రష్యా రాయబార కార్యాలయ అధికారులు తమ దేశాల్లో జాతీయ భద్రతకు ముప్పు కలిగించే రీతిలో వ్యవహరిస్తున్నారని అందుకే వారిపై వేటు వేసినట్టు నెదర్లాండ్ స్పష్టం చేసింది. ఈ వారం ఆరంభంలో 60 మంది రష్యా రాయబారులను బహిష్కరించిన అమెరికా సియాటిల్ లోని రష్యా కాన్సులేట్ జనరల్‌ను కూడా మూసివేసింది.

ఇందుకు ప్రతిగా రష్యా ఎదురుదాడికి దిగింది. మాస్కోలో పనిచేస్తున్న 58 మంది అమెరికా దౌత్యాధికారులతో పాటు, యెకాతెరీన్‌బర్గ్‌లో పనిచేస్తున్న మరో ఇద్దరు దౌత్యాధికారులను రష్యా గురువారం బహిష్కరించింది. నిరాధార అనుమానాలతో రష్యా అధికారులపై ఆరోపణలు చేస్తున్నారని యూరోప్ దేశాల చర్యలు గర్హనీయమని రష్యా మండిపడింది.

Also Read : ఉక్రెయిన్ పతనం

RELATED ARTICLES

Most Popular

న్యూస్