Sunday, January 19, 2025
HomeTrending Newsఆఫ్ఘన్ జోలికి మేము వెళ్ళం – రష్యా  

ఆఫ్ఘన్ జోలికి మేము వెళ్ళం – రష్యా  

ఆఫ్ఘనిస్తాన్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోమని రష్యా తేల్చి చెప్పింది.  ఆఫ్ఘన్ అంతర్గత విషయాల్లో రష్యా తల దూర్చదని ఆ దేశాధ్యక్షుడు వ్లద్మిర్ పుతిన్ మాస్కోలో ప్రకటించారు. కాబుల్ నుంచి మా బలగాలు ఇప్పటికే బయటకు వచ్చేశాయని, ఇక అక్కడి పరిణామాలతో సంబంధం లేదని పుతిన్ స్పష్టం చేశారు. ఆఫ్ఘనిస్తాన్లో ప్రస్తుతం ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందని, ప్రజలు తీవ్ర భయాందోలనలో ఉన్నారన్నారు.

ఆఫ్ఘన్ లో పరిణామాల్ని మాస్కో ఎప్పటికప్పుడు పరిశీలిస్తోందని పుతిన్ వెల్లడించారు. ఈ విషయంలో మిత్ర దేశాలకు రష్యా సహకారం ఉంటుందని వివరించారు. కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్(CSTO)కు అనుగుణంగా సహకారం అందిస్తామన్నారు. కాబుల్ నుంచి రష్యా పౌరుల తరలింపు ఇప్పటికే పూర్తి కావచ్చిందని పుతిన్ తెలిపారు. నాలుగు మిలిటరీ విమానాలతో తజాకిస్తాన్, కిర్గిస్తాన్ మీదుగా తీసుకు వచ్చామన్న్నారు.

దశాబ్దాలుగా ఆఫ్ఘనిస్తాన్లో అశాంతి, అస్థిరత చూస్తున్నామని, అక్కడి పరిస్థితులు చక్కదిద్దేందుకు వెళ్ళిన సోవియెట్ రష్యా కు గతంలో జరిగిన భంగపాటు మరచిపోలేదని పుతిన్ గుర్తుచేశారు. అప్పటి అనుభవాన్ని ఓ గుణపాటంగా  భావిస్తున్నామన్నారు.

మరోవైపు ఫ్రాన్స్ ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. కాబుల్ నుంచి ఫ్రాన్స్ కు విమాన రాకపోకల్ని రేపటి నుంచి నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. శరణార్థులు పెద్ద సంఖ్యలో వస్తుండటం కొత్త సమస్యలకు దారితీస్తుందనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అయితే కాబుల్ విమానాశ్రయం ఆగస్ట్ 31 తర్వాత కూడా పనిచేస్తుందని అమెరికా ప్రకటించింది. తాలిబన్లు కూడా విమానాశ్రయం రాకపోకలకు ఇబ్బందులు సృష్టించక పోవచ్చన్నారు.  అంతర్జాతీయ సహాయ కార్యక్రమాలకు ఆటంకం లేకుండా తాలిబన్లు సహకరిస్తారన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్