Sunday, January 19, 2025
HomeTrending News291 రోజులుగా ఉక్రెయిన్ - రష్యా యుద్ధం

291 రోజులుగా ఉక్రెయిన్ – రష్యా యుద్ధం

పశ్చిమ దేశాల దన్నుతో రష్యాపై రంకెలు వేస్తున్న ఉక్రెయిన్.. దేశ ప్రజలు తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నా యుద్ధం వీడటం లేదు. అమెరికా, యూరోప్ దేశాల నుంచి అందుతున్న సైనిక సాయంతో రష్యాతో శాశ్వత శత్రుత్వం తెచ్చుకుంటోంది. యుద్ధం ప్రారంభమై 291 రోజులు గడుస్తున్నా రెండు దేశాల వైఖరిలో మార్పు రావటం లేదు. ఉక్రెయిన్ ప్రజలు ఆహార కొరతతో ఇబ్బందులు పడుతున్నా.. పాలకులు మాత్రం యుద్ధం వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో రష్యా మరింత ఉగ్రరూపం దాలుస్తోంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. దేశంలోని ప్రముఖ రేవు పట్టణమైన ఒడెస్సాపై శుక్రవారం రాత్రి కామికాజీ డ్రోన్లతో విరుచుకుపడింది. దీంతో నగరంతోపాటు ఒడెస్సా రీజియన్‌లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో మొత్తం 10 లక్షల 50 వేల మందికి పైగా అంధకారంలో చిక్కుకుపోయారు. విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించాలంటే మరో వారం రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ఇరానియన్‌ డ్రోన్లతో అర్ధరాత్రి వేల రష్యా సైన్యం దాడులకు పాల్పడిందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ విమర్శించారు. రెండు డ్రోన్లను తమ సైనికులు కూల్చివేశారని వెల్లడించారు. డ్రోన్‌ దాడితో ఒడెస్సా రీజియన్‌లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగిందని, కేవలం దవాఖానలు, ప్రసూతి వార్డుల వంటి అత్యవసర విభాగాలకు మాత్రమే కరెంటు అందిస్తున్నామని చెప్పారు. పరిస్థితి తీవ్రమైనదే అయిన ప్రస్తుతం అదుపులోనే ఉన్నదని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్