Sunday, January 19, 2025
HomeTrending Newsకొత్త ఏడాదిలో రష్యా సైన్యానికి పుతిన్ ఆఫర్

కొత్త ఏడాదిలో రష్యా సైన్యానికి పుతిన్ ఆఫర్

అమెరికా, నాటో దేశాల దన్నుతో రష్యాతో కయ్యం పెంచుకుంటున్న ఉక్రెయిన్ పై నూతన సంవత్సర వేళ పుతిన్ సేనలు విరుచుకుపడ్డాయి. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌పై రష్యా బాంబుల వర్షం కురిపించింది. కొత్త ఏడాదిలోకి ప్రవేశించిన నిమిషాల వ్యవధిలోనే కీవ్‌పై క్రెమ్లిన్‌ దళాలు మిస్సైల్స్‌తో విరుచుకుపడ్డాయి. రాజధాని పట్టణంతోపాటు మరో రెండు జిల్లాలు బాంబుల మోతతో దద్దరిల్లాయి. సుమారు 23 బాంబులు నిర్వీర్యం చేశామని ఉక్రెయిన్‌ సైన్యం ప్రకటించింది. అంతకుముందు 11 సార్లు భారీ శబ్దాలు వినిపించాయని అంతర్జాతీయ మీడియా ప్రతినిథులు వెల్లడించారు.

విజయం లభించేవరకు ఉక్రేనియన్లు పోరాడుతారని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అన్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధంలో పాల్గొంటున్న సైనికులు, ఇతర ఉద్యోగులు ఇక నుంచి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని రష్యా ప్రకటించింది. దీంతో పాటు యుద్ధంలో మానవత్వంతో ప్రవర్తించే సైనికులకు ప్రభుత్వం బహుమతులు కూడా ఇవ్వనున్నట్లు ప్రభుత్వ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్‌ వెల్లడించారు. ఉక్రెయిన్, డొనెట్స్క్, లుహాన్స్క్, ఖార్సన్. జపోరిజియాలోని నాలుగు ప్రాంతాల్లో యుద్ధంలో పోరాడుతున్న సైనికులను అవినీతి నిరోధక చట్టం పరిధి నుంచి మినహాయింపు ఇచ్చినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో రష్యా సైనికులు ఇక నుంచి తమ ఆదాయం, ఖర్చులు, ఆస్తుల గురించి ప్రభుత్వానికి చెప్పాల్సిన అవసరం లేదన్నమాట.

RELATED ARTICLES

Most Popular

న్యూస్