Sunday, January 19, 2025
HomeTrending Newsరష్యా అధ్యక్షుడి ఆరోగ్యంపై మీడియా పుకార్లు

రష్యా అధ్యక్షుడి ఆరోగ్యంపై మీడియా పుకార్లు

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఆరోగ్యంపై అంతర్జాతీయ మీడియాలో వార్తలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మాస్కోలోని తన అధికారిక నివాసంలో మెట్లపై నుంచి జారిపడినట్లు న్యూయార్క్‌ పోస్టు వెల్లడించింది. మెట్లు దిగుతుండగా కాలుజారీ ఐదు మెట్లకు కింద పడిపోయినట్లు తెలిపింది. దీంతో 70 ఏళ్ళ పుతిన్‌ తుంటి ఎముక విరిగిపోయినట్లు పేర్కొన్నది.

దీనికారణంగా అతని ప్రమేయం లేకుండానే మలమూత్ర విసర్జన జరుగుతుందని, ప్రస్తుతం ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తన కథనంలో తెలిపింది. అయితే దీనిపై క్రెమ్లిన్‌ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇప్పటికే పుతిన్‌ చేతులు పర్పుల్‌ రంగులోకి మారిపోయాయని, గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధడుతున్నారని ఇలా రష్యా అధ్యక్షుడి ఆరోగ్యంపై వరుసగా వార్తలు వస్తూనే ఉన్నాయి.

పశ్చిమ దేశాల మీడియా వ్యూహాత్మకంగా రష్యాను దెబ్బతీసేందుకే తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయని క్రెమ్లిన్ వర్గాలు మండిపడ్డాయి. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం మొదలైన నాటి నుంచి అమెరికా, యూరోప్ దేశాలు ఒక వర్గం కాగా రష్యా ఒంటరిగా ఎదుర్కొంటోంది. రష్యాకు చైనా కొంత మద్దతుగా ఉంటోంది. రష్యా ను నిలువరించేందుకు అమెరికా మొదటి నుంచి కుయుక్తులు పన్నుతోంది. ఉక్రెయిన్ ద్వారా రష్యాను కట్టడి చేయాలనే కుట్రలు ఫలించక పోవటంతో ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ ఆరోగ్యంపై వివిధ రకాల తప్పుడు కథనాలు ప్రచారంలోకి తీసుకొస్తోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్