Friday, September 20, 2024
HomeTrending Newsయుద్ధం అంచున ఉక్రెయిన్ రష్యా

యుద్ధం అంచున ఉక్రెయిన్ రష్యా

Russia Ukraine Crisis : ర‌ష్యా- ఉక్రెయిన్ దేశాలు దాదాపుగా యుద్ధం ముంగింట‌కు వ‌చ్చాయి. దీంతో ప్ర‌పంచ దేశాలు ముఖ్యంగా యూరోప్ లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ప్రపంచం రెండు ధృవాలుగా మారిపోయింది. అమెరికా, యూరోప్ దేశాలు ఉక్రెయిన్ కు అండగా నిలువగా రష్యా సింగల్ గా ఎదుర్కొంటోంది. ఉక్రెయిన్‌కు మ‌ద్ద‌తుగా అగ్ర‌రాజ్యం అమెరికా స‌ర్వ‌శ‌క్తులూ ఒడ్డుతోంది. బహిరంగంగా కాక పోయినా రష్యాకు చైనా బాసటగా ఉంది. ర‌ష్యా మాత్రం ఉక్రెయిన్‌కు వ్య‌తిరేకంగా చాకచక్యంగా పావులు క‌దుపుతోంది. తూర్పు ఉక్రెయిన్‌కు సైన్యాన్ని పంపాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశించారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే ఉక్రెయిన్ కూడా వెనక్కి తగ్గేదేలే అని ప్రకటించింది.

ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త భయాలతో అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు పతనం అవుతున్నాయి. భారత్‌ కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. ఇండియాలో కూడా స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేస్తే మాత్రం ఆ ప్రభావం భారత్‌పై ఎక్కువగానే ఉండొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఏ ఏ అంశాలపై ప్రతికూల ప్రభావం పడొచ్చొ ఒకసారి తెలుసుకుందాం.

యుద్ధ‌మంటూ వ‌స్తే అల్యూమినియం ధ‌ర‌లు కూడా పెరుగుతాయ‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. ప్ర‌పంచం మొత్తం అల్యూమినియం స‌ర‌ఫ‌రాలో 6 శాతం ర‌ష్యాయే చేస్తుంది. దీంతో అల్యూమినియం స‌ర‌ఫ‌రాపై ప్ర‌భావం ప‌డే ఛాన్స్ ఉంది. ఇప్ప‌టికే మార్కెట్‌లో అల్యూమినియం ల‌భ్య‌త త‌క్కువ‌గా ఉంది. చ‌మురు ధ‌ర‌లు కూడా పెరుగుతాయ‌ని ఓ అంచ‌నా. తాజా ప్ర‌క‌ట‌న వ‌ల్ల ఏడేళ్ల గ‌రిష్ఠ స్థాయికి చ‌మురు ధ‌ర పెరిగే అవ‌కాశం ఉంది. ఒక్క రోజులోనే 9 మిలియ‌న్ బ్యారెళ్ల ముడి చ‌మురును ర‌ష్యా ఉత్ప‌త్తి చేస్తుంద‌ని అంచ‌నా.

స‌హ‌జ‌వాయువు ధ‌ర‌లు కూడా పెర‌గ‌తాయ‌ని ఓ అంచ‌నా. ప్ర‌ధానంగా స‌హ‌జ‌వాయువు ఉత్ప‌త్తి చేసే దేశాల్లో ర‌ష్యా ఒక‌టి. 2021 లో ర‌ష్యా 639 బిలియ‌న్ల క్యూబిక్ మీట‌ర్ల స‌హ‌జ వాయువును ఉత్ప‌త్తి చేసింది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఆ యేడాది 3.854 ట్రిలియ‌న్ క్యూబిక్ మీట‌ర్ల స‌హ‌జ‌వాయువు ఉత్ప‌త్తి జ‌రిగింద‌ని ఆ రిపోర్టు తెలిపింది. అంటే ప్ర‌పంచం మొత్తం ఉత్ప‌త్తిలో ర‌ష్యా వాటా 17 శాతం. వీట‌న్నింటితో పాటు రాగి, కోబాల్ట్ ధ‌ర‌లు కూడా పెరుగుతాయి.

Also Read : అమెరికా, నాటో కుట్రలు ఎదుర్కొంటాం – రష్యా

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్