Monday, February 24, 2025
HomeTrending NewsRussia: చైనా పర్యటనకు వ్లాదిమీర్ పుతిన్

Russia: చైనా పర్యటనకు వ్లాదిమీర్ పుతిన్

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ చైనాలో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. అక్టోబర్‌లో ‘బెల్ట్‌ అండ్‌ రోడ్‌’ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఫోరం సమావేశాల్లో పాల్గొనేందుకు అధ్యక్షుడు పుతిన్‌ బీజింగ్‌ వెళ్తున్నారని క్రెమ్లిన్‌ వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశాల్లో చైనా -రష్యా సహకారం కోరనుంది. మధ్య ఆసియా దేశాల మీదుగా యూరోప్ కు చైనా వేయాలనుకుంటున్న రోడ్డుకు రష్యా సహకారం అత్యవసరం.

ఉక్రెయిన్ యుద్దానికి సంబంధించి యుద్ద నేరస్థుడిగా ఇంటర్నేషనల్‌ క్రిమినల్‌ కోర్టు అరెస్టు వారెంట్‌ జారీచేసిన తర్వాత పుతిన్ మొదటి విదేశీ పర్యటన ఇదే కావటం గమనార్హం. మార్చి నెలలో అరెస్ట్ వారంట్ జారీ అయ్యాక పుతిన్ విదేశీ ప్రయాణాలు తగ్గించారు. ఇటీవల దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్ సమావేశాలకు కుడా గైర్హాజరయ్యారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్