ఉక్రెయిన్ పై దురాక్రమణకు పాల్పడినందుకు ప్రపంచ దేశాలు రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ ఆంక్షల ఫలితంగా ఆల్ టైం కనిష్ఠానికి రష్యా కరెన్సీ రూబుల్ పతనమైంది. ఒక్క రోజులోనే ఏకంగా 30 శాతం పడిపోయింది. ఇది రష్యా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. ఆఫ్ షోర్ ట్రేడింగ్లో అమెరికా డాలర్తో పోలిస్తే రష్యా రూబుల్ 114.33 స్థాయికి క్షీణించింది.