Wednesday, March 11, 2026
Homeసినిమా‘ఆహా’ లో సందడి చేయనున్న ‘ఎస్.ఆర్.కళ్యాణ మండపం’

‘ఆహా’ లో సందడి చేయనున్న ‘ఎస్.ఆర్.కళ్యాణ మండపం’

తెలుగు వినోద రంగంలో సరికొత్త కంటెంట్ తో ప్రేక్షకులను అలరిస్తున్న ఏకైక తెలుగు ఓటీటీ సంస్థ ‘ఆహా’.  బ్లాక్ బస్టర్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు, టాక్‌షోలతో నిరంత‌రం ప్రేక్ష‌కుల‌కు తిరుగులేని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందిస్తోంది. తాజాగా థియేటర్లలో విడుదలై సూప‌ర్ హిట్ అయిన ‘ఎస్.ఆర్.కళ్యాణ మండపం’ చిత్రం ఆగస్టు 28న ‘ఆహా’ ద్వారా ప్రేక్షకులను పలకరించనుంది.

ఈ సందర్భంగా హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ… ‘‘కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుముఖం పట్టిన తర్వాత, మంచి చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో మా ‘ఎస్.ఆర్.కళ్యాణ మండపం’ చిత్రాన్ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. మా నమ్మకాన్ని తెలుగు ఆడియెన్స్ నిజం చేసి ‘ఎస్.ఆర్.కళ్యాణ మండపం’ ను అపూర్వంగా ఆదరించారు. థియేటర్లలో మా సినిమాను ఆద‌రించిన విధంగానే ఈ ఆగ‌స్ట్ 28న ఆహాలో విడుద‌ల‌వుతున్న మా సినిమా ఆద‌రించాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తిరుగులేని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్న ఆహా లిస్టులో మా ‘ఎస్.ఆర్.కళ్యాణ మండపం’ చేయ‌డం ఆనందంగా ఉంది’’ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular