Sunday, January 19, 2025
Homeసినిమా‘పుష్ప’లో ‘సామీ’ సాంగ్.. అదిరింది సామీ...

‘పుష్ప’లో ‘సామీ’ సాంగ్.. అదిరింది సామీ…

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు విడుదల చేసిన రెండు పాటలూ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈరోజు ‘సామీ సామీ’ అంటూ సాగే మరో పాటను విడుదల చేశారు. ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా.. మౌనికా యాదవ్ ఆలపించారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఈ పాట కూడా విన్న వెంటనే నచ్చేట్టుగా ఉంది. పక్కా మాస్ బీట్ గా ఉన్న ఈ సాంగ్ థియేటర్లో ఆడియన్స్ లో ఓ ఊపు తీసుకువస్తుంది అనడంలో సందేహం లేదు.

ఈ సాంగ్ పిక్చరైజేషన్ కూడా చాలా కలర్ ఫుల్ గా కనిపిస్తుంది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. ఆయన కొరియోగ్రఫీ చేస్తే.. ఆ సాంగ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అదే బన్నీతో స్టెప్పులు వేయించడం అంటే.. ఆ సాంగ్ మామూలుగా ఉండదు. టాపు లేచిపొద్ది అనేట్టుగా ఉంటుంది. ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన పాటలు ఒక పాటకు మించి మరో పాట విశేషంగా ఆకట్టుకుంటుండడం.. రికార్డు వ్యూస్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తుండడంతో పుష్ప సినిమా పై ఇప్పటి వరకు ఉన్న అంచనాలు రెట్టింపు అవుతున్నాయి. డిసెంబర్ 17న పుష్ప ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్