Friday, March 29, 2024
HomeTrending Newsకలిసుందాం రండి: పేర్నినాని

కలిసుందాం రండి: పేర్నినాని

రెండు తెలుగు రాష్ట్రాలు మళ్ళీ కలిసిపోయి ఒకేరాష్ట్రంగా కలిసుందామని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్నినాని ప్రతిపాదించారు. ఏపీలో పార్టీ పెట్టమని అక్కడి ప్రజలు తనను అడుగుతున్నరంటూ తెలంగాణా సిఎం కేసిఆర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై నాని స్పందించారు. ఆంధ్రాలో మేము, తెలంగాణా అసెంబ్లీలో మీరు ఈ మేరకు తీర్మానం చేద్దామని సూచించారు. రెండు పార్టీలు దేనికని అదే పార్టీ ఇక్కడా నడపొచ్చంటూ సలహా ఇచ్చారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని, దుర్మార్గంగా విడగొట్టవద్దని 2013లోనే జగన్ చెప్పారని మంత్రి గుర్తు చేశారు.

బీసీ జన గణన చేపట్టాలని కేంద్రాన్ని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయనుంది. ఈ తీర్మానం రూపకల్పన బాధ్యతలను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖకు అప్పగిస్తూ రాష్ట్రమంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్ పగటి పూట అందించేందుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఇండియాతో ఒప్పందానికి కేబినేట్ ఆమోదిస్తూ ఒక్కో యూనిట్ 2.49 రూపాయలకు కొనుగోలు చేయాలని నిర్ణయించింది.  ఈరోజు కేబినేట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని మీడియాకు వెల్లడించారు. అమ్మఒడి పొందాలంటే 75 శాతం హాజరు తప్పనిసరి అనే నిబంధనను ఈ పథకం ప్రారంభించిన రోజునే సిఎం జగన్ చెప్పారని మంత్రి గుర్తు చేశారు. దానికి సంబంధించిన వీడియోలను ప్రదర్శించారు. ఎయిడెడ్ పాఠశాలలను ప్రభుత్వానికి అప్పగించే విషయంలో ఎలాంటి ఒత్తిడి లేదని  కేబినేట్ లో సిఎం జగన్ స్పష్టంగా చెప్పారని మంత్రి వెల్లడించారు.

పేర్ని నాని మీడియా సమావేశంలో వెల్లడిచిన ముఖ్యాంశాలు:

వైద్య ఆరోగ్య శాఖలో 4035 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు క్యాబినెట్ ఆమోద ముద్ర
560 అర్బన్ హెల్త్ క్లినిక్స్ లో ఫార్మాసిస్టు పోస్టుల భర్తీకి ఆమోదం
వైద్య ఆరోగ్య శాఖలో మొత్తం 41,308 పోస్టుల భర్తీ లక్ష్యం
వీటిలో ఇప్పటికే 26917  పోస్టులు భర్తీ చేశాం
అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తాం
సంక్షేమ పథకాల అమలుకు ప్రతి డిసెంబర్, జూన్ లో అర్హులు నమోదు చేసుకునే ఏర్పాటు
ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక శాఖ ఏర్పాటు
ఈ డబ్ల్యూ ఎస్ వెల్ఫేర్ డిపార్టుమెంటు పేరుతో ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం
జైన్, సిక్కులకు ప్రత్యెక కార్పొరేషన్లు
ఆది వెలమ, పద్మ వెలమలకు ప్రత్యేకంగా కార్పోరేషన్ల ఏర్పాటుకు సిఎం గ్రీన్ సిగ్నల్
ఇకపై ప్రతి ఏడాదీ ఆంద్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవం నవంబర్ 1న వైఎస్సార్  జీవన సాఫల్య, సాఫల్య పురస్కారాల ప్రదానం
ఆన్ లైన్ టికెటింగ్ వ్యవస్థకు కేబినేట్ ఆమోదముద్ర, 1965 సినిమాటోగ్రఫీ చట్టానికి సవరణ
ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నేతృత్వంలో ఆన్ లైన్ టికెటింగ్ వ్యవస్థ అమలు
విశాఖ శ్రీ శారదా పీఠానికి వేద పాఠశాల నిర్మాణం కోసం కొత్త వలసలో 15 ఎకరాల స్థలం కేటాయింపు

RELATED ARTICLES

Most Popular

న్యూస్