Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్Australian Open-2023: విజేత సబలెంక

Australian Open-2023: విజేత సబలెంక

బెలారస్ క్రీడాకారిణి అరీనా సబలెంక ఆస్ట్రేలియన్ ఓపెన్-2023 మహిళల సింగిల్స్ టైటిల్ ను కైవసం చేసుకుంది. నేడు జరిగిన ఫైనల్లో కజకిస్తాన్ కు చెందిన ఎలీనా రిబకినాపై 4-6;6-3;6-4 తేడాతో సబలెంక విజేతగా నిలిచింది.

సబలెంకకు ఇది మూడో గ్రాండ్ స్లామ్ టైటిల్ కాగా, సింగిల్స్ విభాగంలో మొదటి టైటిల్ గెల్చుకుంది. ఎలీస్ మెర్టిన్ తో కలిసి మహిళల డబుల్స్ లో 2019 యూఎస్ ఓపెన్, 2021 ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్స్ ఆమె గెల్చుకుంది.

పురుషుల డబుల్స్ లో ఆస్ట్రేలియా జోడీ జేసన్ కుబ్లేర్- రింకీ హిజికట ద్వయం 6-4;7-6 తేడాతో హ్యూగో నీస్ (ఫ్రెంచ్); జాన్ జెలేస్కీ (పోలాండ్)కు చెందిన జోడీపై విజయం సాధించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్