Sunday, February 23, 2025
HomeTrending Newsఈనెల17నుంచి తెరుచుకోనున్న శబరిమల

ఈనెల17నుంచి తెరుచుకోనున్న శబరిమల

శబరిమలలోని అయ్యప్ప దేవాలయాన్ని ఈ నెల 17 నుంచి తెరవనున్నట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది. ఐదు రోజుల పాటు ఆలయం తెరిచి ఉంటుందని పేర్కొంది . కరోనా నేపథ్యంలో రోజుకు 15 వేల మందిని మాత్రమే దర్శనానికి అనుమతించనున్నట్లు తెలిపింది. దర్శనం కోసం భక్తులు ఆన్లైన్ లో రిజర్వేషన్ చేసుకోవచ్చని సూచించింది.

మరోవైపు కేరళలో కరోనా కేసులు భారీగా నమోదవుతుండటం గమనార్హం. తాజాగా 24 గంటల వ్యవధిలో కేరళలో 26 వేల కేసులు నమోదయ్యాయి. 115 మంది చనిపోయారని, పాజిటివిటి రేటు 16.69గా ఉందని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు.   ఓనం వేడుకల నాటి నుంచి కేరళలో కరోనా కేసులు పెరుగుదల తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో శబరిమల ఆలయానికి భక్తులను అనుమతించటం వివాదాస్పదంగా మారింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్