Thursday, February 27, 2025
HomeTrending NewsRajasthan: న్యాయం జరిగే వరకు పోరాటం - సచిన్‌ పైలట్‌

Rajasthan: న్యాయం జరిగే వరకు పోరాటం – సచిన్‌ పైలట్‌

ప్రజల నమ్మకం, ఆదరణే తనకు పెద్ద ఆస్తి అని, వారికి న్యాయం జరిగే వరకు తన పోరాటం కొనసాగిస్తూనే ఉంటానని, ఈ విషయంలో వెనుకంజ, వెన్ను చూపే ప్రసక్తే లేదని రాజస్థాన్‌ కాంగ్రెస్‌ అసమ్మతి నేత సచిన్‌ పైలట్‌ స్పష్టం చేశారు. కేంద్ర మాజీ మంత్రి, తన తండ్రి రాజేష్‌ పైలట్‌ వర్థంతి సందర్భంగా ఆదివారం ఆయన విగ్రహాన్ని సచిన్‌ ఆవిష్కరించారు.

గెహ్లాట్‌ ప్రభుత్వంపై నిరసన గళం వినిపిస్తున్న పైలట్‌ ఆదివారం తన భవిష్యత్‌ రాజకీయ కార్యాచరణను వెల్లడిస్తారని, ఈ క్రమంలో కొత్త పార్టీని ప్రకటిస్తారని విస్తృతంగా ప్రచారం జరిగింది. కాంగ్రెస్‌ అధిష్ఠానం హామీ మేరకు ఆయన తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్టు తెలిసింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్