Sunday, January 19, 2025
Homeసినిమాపవన్ మూవీ పై క్లారిటీ ఇచ్చిన తేజ్

పవన్ మూవీ పై క్లారిటీ ఇచ్చిన తేజ్

పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చారు. మూవీతో సక్సెస్ సాధించిన పవన్ ఆతర్వాత ‘భీమ్లా నాయక్’ మూవీతో మరో సక్సెస్ సాధించారు. ఓ వైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరో వైపు సినిమాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం పవన్ ‘హరి హర వీరమల్లు’ అనే సినిమాలో నటిస్తున్నారు. విభిన్న కథా చిత్రాల దర్శకుడు క్రిష్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది పవన్ నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడం విశేషం. ఈ భారీ పిరియాడిక్ మూవీని సీనియర్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

అయితే.. ఈ సినిమానే కాకుండా పవన్ హరీష్‌ శంకర్ తో ‘భవదీయుడు భగత్ సింగ్’, సురేందర్ రెడ్డితో ఓ మూవీ, సుజిత్ తో ఓ మూవీ, సముద్రఖని డైరెక్షన్ లో ‘వినోదాయశితం’ రీమేక్ లో నటించనున్నట్టు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ తో పాటు సాయిధరమ్ తేజ్ కూడా నటించనున్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టి.జీ. విశ్వప్రసాద్ నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి సాయిధరమ్ తేజ్ కు అడ్వాన్స్ కూడా ఇచ్చారని టాక్.

ఈ రీమేక్ పూర్తయ్యే వరకు మరో ప్రాజెక్టు చేయకూడదని, పవన్ ఎప్పుడు కాల్షీట్లు ఇస్తే.. అప్పుడు అందుబాటులో ఉండాలనే షరతుకు కూడా ఒప్పుకున్నాడట. అయితే.. శుక్రవారం సాయిధరమ్ తేజ్ కొత్త సినిమా మొదలుపెట్టాడు. బీవీఎస్ఎన్ ప్రసాద్ బ్యానర్ పై కొత్త దర్శకుడ్ని జయంత్ ని పరిచయం చేస్తూ, ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చేయబోతున్నాడు. ఈ ప్రాజెక్టు లాంఛనంగా మొదలైంది. స్వయంగా సాయితేజ్ క్లాప్ కొట్టి మరీ ఈ సినిమా లాంఛ్ చేశాడు. సాయితేజ్ ఇలా మరో సినిమా స్టార్ట్ చేశాడంటే.. వినోదాయశితం రీమేక్ ఇప్పట్లో సెట్స్ పైకి రాదనే దానర్థం. ఈ విధంగా సాయితేజ్ పవన్ కళ్యాణ్ రీమేక్ పై ఇన్ డైరెక్ట్ గా క్లారిటీ ఇచ్చారు అంటున్నారు సినీజనాలు. మరి.. వినోదాయశితం ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో..?

RELATED ARTICLES

Most Popular

న్యూస్