Wednesday, June 17, 2026
HomeTrending Newsజాతీయ బీసి కమిషన్ చైర్మన్ గా హన్స్‌రాజ్‌ అహిర్‌

జాతీయ బీసి కమిషన్ చైర్మన్ గా హన్స్‌రాజ్‌ అహిర్‌

వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్‌ (ఎన్సీబీసీ) చైర్‌పర్సన్‌గా కేంద్ర మాజీ మంత్రి హన్స్‌రాజ్‌ అహిర్‌ బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వెనుకబడిన తరగతుల సంక్షేమానికి కృషి చేస్తానని చెప్పారు. ఇతర వర్గాలతో సమానంగా వెనుకబడిన తరగతులకు చెందిన ప్రజలను అభివృద్ధి పథంలో తీసుకువెళ్లడం ఒక సవాలుగా, బాధ్యతగా భావిస్తున్నానని ఆయన చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన సబ్‌కా సాథ్ సబ్‌కా వికాస్ నినాదాన్ని ఆచరిస్తూ బిసిల సంక్షేమానికి పాటుపడతానని ఆయన చెప్పారు. 2014 నుంచి 2019 వరకు కేంద్ర హోం వ్యవహారాలు, రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రిగా 68 ఏళ్ల అహిర్ పనిచేశారు. 2014 నుంచి 2019 వరకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా హన్స్‌రాజ్‌ పనిచేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular