Friday, April 19, 2024
Homeసినిమాఆహా కోసం ఆదిపురుష్‌ వస్తున్నాడా..?

ఆహా కోసం ఆదిపురుష్‌ వస్తున్నాడా..?

తెలుగు ఓటీటీ ‘ఆహా’.. సరికొత్త పొగ్రామ్స్ అందిస్తూ.. వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంటంది. బాగా సక్సెస్ అయిన పొగ్రామ్ ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కే.’ ఫస్ట్ సీజన్ సూపర్ సక్సెస్ అయ్యింది. దీంతో సెకండ్ సీజన్ పై మరింత క్రేజ్ ఏర్పడింది. ఎప్పుడెప్పుడు సెకండ్ సీజన్ స్టార్ట్ అవుతుందా అని ఎదురు చూశారు. అంచనాలకు తగ్గట్టుగానే సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. సెకండ్ సీజన్ లో ఫస్ట్ ఎపిసోడ్ నారా చంద్రబాబు నాయుడుతో స్టార్ట్ చేశారు. దీనికి అనూహ్య స్పందన లభించింది.

యంగ్ హీరోలతో, హీరోయిన్ లతో స్పెషల్ ఎపిసోడ్స్ చేస్తున్నారు. ఇటీవల స్టార్ ప్రొడ్యూసర్స్ అల్లు అరవింద్, సురేష్‌ బాబులతో స్పెషల్ ఎపిసోడ్ చేశారు. ఈ ఎపిసోడ్ కు సంబంధించి ప్రొమో రిలీజ్ చేశారు. ఇలా ఈ ప్రొమో రిలీజ్ చేశారో లేదో అలా యూట్యూబ్ లో వైరల్ అయ్యింది. ఇక అసలు విషయానికి వస్తే.. అతి త్వరలో ఆహా కోసం ‘ఆదిపురుష్‌’.. అదేనండి ప్రభాస్ వస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. ప్రభాస్ ని ఈ షోకు తీసుకొచ్చేందుకు అల్లు అరవింద్ గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. చలాకీగా జోవియల్ గా మాట్లాడే బాలయ్య ముందు సిగ్గరి ప్రభాస్ అంత ఓపెన్ గా మాట్లాడగలడు అనేది ఆసక్తిగా మారింది.

గతంలో మహేష్ బాబు, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, విశ్వక్ సేన్, సిద్దు, శర్వానంద్ తదితర హీరోలను బాలకృష్ణ డీల్ చేసిన తీరు వ్యూవర్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. కాబట్టి ప్రభాస్ వచ్చినా ఇబ్బంది లేదు. ఈజీగా కలిపేసుకుంటాడు బాలయ్య. కాకపోతే బాహుబలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా లేదా అనేది క్లారిటీ రావాల్సివుంది. అయితే… నిజంగా ఈ షోకు ప్రభాస్ వస్తే మాత్రం డార్లింగ్ పెళ్లి వ్యవహారం, పెదనాన్న కృష్ణంరాజుతో అనుబంధం, ఫుడ్ విషయంలో తను ఇచ్చే ఆతిధ్యం, ఇటీవల డిజాస్టర్లు, రాబోయే ‘ఆదిపురుష్’, ‘సలార్’ ఇలా చాలా విశేషాలు షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. మరి.. త్వరలోనే ప్రభాస్ ఈ షోకు రావడం పై క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్