Thursday, March 19, 2026
Homeసినిమాసాయిపల్లవి ఎందుకు ఏడ్చింది?

సాయిపల్లవి ఎందుకు ఏడ్చింది?

Rahul Sankrityan on Sai Pallavi:
శ్యామ్ సింగ రాయ్‘ సినిమా ఈ నెల 24వ తేదీన థియేటర్స్ లో దిగిపోనుంది. నాని .. సాయిపల్లవి .. కృతి శెట్టి .. మడోన్నా సెబాస్టియన్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి హైదరాబాదులో జరిగింది. దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ ఈ సినిమా గురించిన విషయాలను చెబుతూ, సాయిపల్లవిని గురించి ప్రస్తావించాడు. ఆ పేరు వినగానే ఆడిటోరియం అంతా ఒక్కసారిగా ఈలలతో .. అరుపులతో మారుమ్రోగిపోయింది. ఆ రెస్పాన్స్ ను చూసి ఆనందాన్ని తట్టుకోలేక సాయిపల్లవి స్టేజ్ పైనే ఏడ్చేసింది.

ఆమెను గురించి రాహుల్ సాంకృత్యన్ మాట్లాడుతూ .. “సాయిపల్లవి గారు ఈ సినిమాలో చేసిన పాత్రను నాకు తెలిసి అలా ఇంకెవరూ చేయలేరు. నాకు ఇంకో ఆప్షన్ కూడా లేదు. నిజంగా చెబుతున్నాను .. ఇండియాలో ఉన్న ఫైనెస్ట్ నటీమణులలో ఆమె ఒకరు. గుర్తుపెట్టుకోండి యాక్టింగ్ పరంగా నెక్స్ట్ జనరేషన్స్ కి ఆమె కాబోయే లెజెండ్. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో ఆమె మేజిక్ చేశారు. ఆ మేజిక్ ను మీరు ఈ నెల 24వ తేదీన థియేటర్లలో చూసి తీరవలసిందే. సాయిపల్లవిగారితో మళ్లీ మళ్లీ వర్క్ చేసే అవకాశం దొరుకుతుందని ఆశిస్తున్నాను.

పగలంతా ఆమె గంటలు గంటల తరబడి డాన్స్ ప్రాక్టీస్ చేసేవారు. ఆ తరువాత షూటింగులో పాల్గొనేవారు. బరువైన కాస్త్యుమ్స్ వేసుకుని .. గజ్జెలు కట్టుకుని డాన్స్ చేసేవారు. అలా డాన్స్ చేయడం కోసం ఆమె ఫుడ్ తీసుకునేవారు కాదు. తింటే డాన్స్ చేయలేనని అనేవారు. అలా తినకుండా ఆకలితోనే డాన్స్ చేసేవారు. ఆ రాత్రి అంతా నిద్ర పోయేవారు కాదు .. మళ్లీ ఉదయాన్నే డాన్స్ ప్రాక్టీస్ .. ఇలా ఎంతో కష్టపడ్డారు. కోవిడ్ ఉన్న పరిస్థితుల్లో ఆమె అంత రిస్క్ తీసుకుని చేయడం మరో విశేషం. ఆమె ఈ పాత్రకోసం ఎంతో ఎఫర్ట్ పెట్టారు .. ఆ పాత్రకి ప్రాణం పోశారు. అదంతా కూడా స్క్రీన్ పై కనిపిస్తుంది” అంటూ చెప్పుకొచ్చాడు.

Also Read : వాసు .. శ్యామ్ సింగ రాయ్ మధ్య కనెక్షన్ ఏంటి? 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular