తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో సాయిపల్లవికి విపరీతమైన క్రేజ్ ఉంది. అయితే తమిళ .. మలయాళ భాషల్లో కంటే తెలుగుకే మొదటి ప్రాధాన్యతనిస్తూ ఆమె ముందుకు వెళుతోంది. ఆమెను ఒక తెలుగు అమ్మాయిగానే ప్రేక్షకులు ఆదరించారు. ఫ్యామిలీ ఆడియన్స్ లోను .. యూత్ లోను ఆమెకి మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకు కారణం ఆమె ఎంచుకుంటున్న కథలు .. పాత్రలేనని చెప్పాలి

సాయిపల్లవిని తొలిసారిగా పోస్టర్స్ లో చూసిన తెలుగు ఆడియన్స్,  ఓ మోస్తరు అందగత్తె అనుకున్నారు. సాయిపల్లవి సినిమాకి వెళ్లిన వాళ్లంతా ఆమె అభిమానులు కాకుండా ఉండలేకపోయారు. అలా తన నటనతో .. డాన్స్ తో ఆమె కట్టిపడేస్తూ వచ్చింది. అప్పటి వరకూ హీరోల డాన్సుల గురించి మాత్రమే మాట్లాడుకుంటూ వచ్చిన ఫ్యాన్స్, సాయిపల్లవి డాన్స్ గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.

ఈ మధ్య కాలంలో సాయిపల్లవి నుంచి ‘లవ్ స్టోరీ’ .. ‘శ్యామ్ సింగ రాయ్’ వంటి హిట్స్ వచ్చాయి. అయినా కొత్త ప్రాజెక్టులకి సంబంధించి ఎక్కడా కూడా ఆమె పేరు వినిపించడం లేదు. అలా అని చెప్పేసి సాయిపల్లవి క్రేజ్ తగ్గిందనీ .. ఆమె మార్కెట్ పడిపోయిందని చెప్పడానికి లేదు. తనకి నచ్చితే తప్ప ఎంత పారితోషికం ఇచ్చినా ఆమె చేయదనే సంగతి తెలిసిందే. ఆమె సైన్ చేయలేదంటే నచ్చిన కథ తన దగ్గరికి రాలేదనే అనుకోవాలి. అభిమానులు మాత్రం ఆమె నుంచి మరో సినిమా ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *