Saturday, January 18, 2025
Homeసినిమామరోసారి నాని జోడీగా సాయిపల్లవి? 

మరోసారి నాని జోడీగా సాయిపల్లవి? 

తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో సాయిపల్లవికి మంచి క్రేజ్ ఉంది. సాయిపల్లవి ఎంచుకునే పాత్రలు .. ఆ పాత్రలలో ఆమె ఇమిడిపోయే తీరు ఆమెకి ఈ స్థాయి ఇమేజ్ ను తెచ్చిపెట్టాయి. కథ .. పాత్ర తనకి నచ్చితేనే తప్ప .. వాటిలో కొత్తగా విషయం ఉంటే తప్ప ఆమె అంగీకరించదనే విషయం ఆడియన్స్ కి కూడా తెలుసు. అందువల్లనే ఆమె నుంచి వచ్చే సినిమాల సంఖ్య తక్కువగా ఉంటుంది. ఆమె సినిమాల కోసం ఎప్పటికప్పుడు అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తూనే  ఉంటారు.

అలాంటి సాయిపల్లవి ప్రస్తుతం తెలుగులో ‘తండేల్’ చేస్తోంది. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆమె మరోసారి నాగచైతన్యతో కలిసి కనిపించనుంది. ఇక త్వరలో బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటే దిశగా ఆమె ముందుకు వెళుతోంది. ఈ నేపథ్యంలో ఆమె మరోసారి నాని సరసన నాయికగా కనిపించే అవకాశం ఉన్నట్టుగా ఒక ప్రచారమైతే జరుగుతోంది. ఈ సినిమాకి దర్శకుడిగా శేఖర్ కమ్ముల పేరు వినిపిస్తోంది.

ప్రస్తుతం శేఖర్ కమ్ముల ‘కుబేర’ సినిమా పనులతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత ఆయన నానితో ఒక ప్రాజెక్టు సెట్ చేసే ఆలోచనలో ఉన్నాడని అంటున్నారు. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఈ సినిమాలో కథానాయిక సాయిపల్లవి అయితే బాగుంటుందని భావించి ఆమెను సంప్రదిస్తున్నట్టుగా సమాచారం. ఈ ప్రాజెక్టు పట్ల నాని కూడా ఉత్సాహంగా  ఉన్నాడని టాక్. గతంలో నాని – సాయిపల్లవి కలిసి ‘శ్యామ్ సింగరాయ్’తో హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే కాంబినేషన్లో ఈ ప్రాజెక్టు సెట్ అయితే, అభిమానులకు హ్యాపీ న్యూస్ అవుతుందనడంలో సందేహం లేదు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్