Saturday, March 14, 2026
HomeసినిమాBalayya-HIT: 'హిట్' యూనివర్శల్ లోకి బాలయ్య!

Balayya-HIT: ‘హిట్’ యూనివర్శల్ లోకి బాలయ్య!

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో  నటిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి ‘భగవత్ కేసరి’ టైటిల్ పరిశీలిస్తున్నారు. జూన్ 10న బాలయ్య పుట్టినరోజు సందర్భంగా టైటిల్ అనౌన్స్ చేయనున్నారు.

ఇదిలా ఉంటే.. బాలయ్య యంగ్ డైరెక్టర్స్ తో వర్క్ చేయడానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. అ, కల్కి, జాంబిరెడ్డి చిత్రాలను తెరకెక్కించి ప్రస్తుతం హనుమాన్ సినిమాని రూపొందిస్తున్న యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో సినిమా చేసేందుకు బాలయ్య ఓకే చెప్పారు. మరో వైపు హిట్ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమై తొలి ప్రయత్నంలో సక్సెస్ సాధించిన శైలేష్ కొలనుతో కూడా సినిమా చేసేందుకు అంగీకరించారని సమాచారం. హిట్ 2 సినిమా కూడా సక్సెస్ అయ్యింది. హిట్ 3 నానితో ఉంటుందని వార్తలు వచ్చాయి.

హిట్ 4 బాలయ్యతో ఉంటుందని టాక్ వినిపిస్తుంది. బాలయ్య పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా నటిస్తే.. ఆ సినిమా పై మరింత క్రేజ్ రావడం ఖాయం. శైలేష్ కొలను ప్రస్తుతం వెంకటేష్ తో సైంధవ్ అనే భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని డిసెంబర్ లో రిలీజ్ చేయనున్నారు. ఆతర్వాత నానితో హిట్ 3 ఉంటుందట. ఈ సినిమా పూర్తైన తర్వాత బాలయ్యతో హిట్ 4 ఉంటుందని ప్రచారం జరుగుతుంది. ఆల్రెడీ స్టోరీ లైన్ చెబితే బాలయ్య ఇంప్రెస్ అయ్యారని అంటున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగి హిట్ 4 లో బాలయ్య నటిస్తే.. సంచలనమే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular