Saturday, November 23, 2024
Homeస్పోర్ట్స్ BWF World Championships 2022: సైనా, గాయత్రి-జాలీ జోడీ విజయం

 BWF World Championships 2022: సైనా, గాయత్రి-జాలీ జోడీ విజయం

జపాన్ రాజధాని టోక్యోలో జరుగుతోన్న బి.డబ్ల్యూ.ఎఫ్.  వరల్డ్ ఛాంపియన్ షిప్స్ 2022లో నేడు రెండో రోజు ఇండియా క్రీడాకారులు సత్తా చాటారు.  సైనా నెహ్వాల్; గాయత్రి గోపీచంద్- త్రెసా జాలీ….. అశ్విని భట్- శిఖా గౌతమ్ జోడీలు తమ ప్రత్యర్థులపై గెలుపొంది తర్వాతి రౌండ్లోకి ప్రవేశించారు.

మహిళల సింగిల్స్ లో సైనా నెహ్వాల్ 21-19;21-9తో హాంగ్ కాంగ్ ప్లేయర్ చెయుంగ్ యెన్ యి పై విజయం సాధించింది.

మహిళల డబుల్స్ లో గాయత్రి గోపీచంద్ -త్రెసా జాలీ జోడీ  21-11; 21-13తో మలేషియా జంట లో యూ యుయాన్-వలెర్రీ సియో పై…. మరో మ్యాచ్ లో అశ్విని భట్- శిఖా గౌతమ్ జోడీ 21-8, 21-14తో ఇటలీ క్రీడాకారులు మార్టినా కోర్సిని-జుడిత్ మయిర్ పై విజయం సాధించారు

పురుషుల డబుల్స్ లో గరగ కృష్ణ ప్రసాద్- పంజాల విష్ణు వర్ధన్ గౌడ్ ద్వయం 14-21;18-21 తేడాతో ఫ్రాన్స్ ఆటగాళ్ళు ఫాబిఎన్ డెల్రూ-విలియం విల్లెగేర్  చేతిలో ఓటమి పాలయ్యారు.

మిక్స్డ్ డబుల్స్ లో

ఇషాన్ భట్నాగర్- తానీషా క్రాస్టో జోడీ 14-21; 17-21 తేడాతో థాయ్ లాండ్ జోడీ సుపాక్ జోంఖో- సుపిస్సరపై ఓడిపోయారు.

వెంకట్ గౌరీ ప్రసాద్- జూహీ దేవాంగన్ ద్వయం 21-10, 23-21  తో ఇంగ్లాండ్ జంట గ్రెగొరీ మైర్స్- జెన్నీ మూర్ చేతిలో ఓటమి పాలయ్యారు.

Also Read: తొలి రౌండ్ లో ఇండియాకు ఆరు విజయాలు

RELATED ARTICLES

Most Popular

న్యూస్