Thursday, March 12, 2026
Homeస్పోర్ట్స్Thailand Open: సేన్, సైనా గెలుపు- సింధు, శ్రీకాంత్ ఓటమి

Thailand Open: సేన్, సైనా గెలుపు- సింధు, శ్రీకాంత్ ఓటమి

భారత షట్లర్లు పివి సింధు, కిడాంబి శ్రీకాంత్ లు థాయ్ లాండ్ ఓపెన్-2023 తొలి రౌండ్ లోనే ఓటమి పాలై నిష్క్రమించారు. కాగా లక్ష్య సేన్, సైనా నెహ్వాల్,  సాత్విక్-చిరాగ్ జోడీలు తమ ప్రత్యర్ధులపై విజయం సాధించి ప్రీ క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకున్నారు.

పురుషుల  సింగిల్స్ లో లక్ష్య సేన్ 21-23; 21-15;21-15 తో తైపీ ఆటగాడు వాంగ్ జు వీ పై…. రణ్ జార్జ్ 21-18;22-20తో చైనా ప్లేయర్ షి యూ కి పై విజయం సాధించారు.

మహిళల సింగిల్స్ లో అస్మిత చలీహా మన దేశానికే చెందిన మాళవిక బన్సోద్ పై 21-17;21-14తో… కి  సైనా నెహ్వాల్ 21-13; 21-7 తో కెనడా ప్లేయర్ వెన్ యూ ఝంగ్ పై గెలుపొందారు.

పురుషుల డబుల్స్ లో సాత్విక్ సాయిరాజ్ రాంకీ రెడ్డి- చిరాగ్ శెట్టి 21-13; 18-21; 21-17తో డెన్మార్క్ జోడీ రస్మస్-ఫ్రెడరిక్ పై విజయం సాధించారు.

కెనడా ప్లేయర్ మిచేల్లీ లీ 21-8; 18-21; 21-18 తేడాతో పివి సింధుపై విజయం సాధించింది.

కిడాంబి శ్రీకాంత్ 8-21; 21-16; 14-21తో చైనా ప్లేయర్ వెంగ్ హాంగ్ యంగ్ చేతిలో ఓటమి చెందాడు.

పురుషుల  సింగిల్స్ లో ప్రియాన్షు రాజావత్, సమీర్ వర్మ, సాయి ప్రణీత్…. మహిళల డబుల్స్ లో అశ్విని భట్, శిఖా గౌతమ్ లు తమ ప్రత్యర్థులపై ఓటమి పాలయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular