Saturday, April 20, 2024
HomeసినిమాSaindhav: ’సైంధవ్’ కీలక షెడ్యూల్ పూర్తి

Saindhav: ’సైంధవ్’ కీలక షెడ్యూల్ పూర్తి

విక్టరీ వెంకటేష్ నటిస్తున్న 75వ చిత్రం ‘సైంధవ్’. ఈ చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. నిహారిక ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఇప్పటికే హైదరాబాద్ లో కీలక షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఓ పాట చిత్రీకరణ కోసం భారీ సెట్ వేశారు. మొదటి షెడ్యూల్ లో ప్రధాన నటీనటుల పై కీలకమైన సన్నివేశాలను, ఫైట్ సీక్వెన్స్ ను గ్రాండ్ గా రూపొందించారు. ఈ సినిమా రూపుదిద్దుకుంటున్న తీరు పట్ల చిత్ర యూనిట్ సంతోషంగా ఉంది.

సినిమా టైటిల్ పోస్టర్, గ్లింప్స్ కు అద్భుతమైన స్పందన రావడంతో సినిమా పై మరింత ఆసక్తి పెరిగింది. సైంధవ్ భారీ బడ్జెట్తో భారీ స్థాయిలో రూపొందుతోంది. వెంకటేష్ కెరీర్లో ఇది అత్యంత కాస్ట్లీ మూవీ. బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ ఈ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నారు. అలాగే పలువురు ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం పని చేస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఎస్ మణికందన్ కెమెరామెన్ గా, గ్యారీ బిహెచ్ ఎడిటర్ గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి కిషోర్ తాళ్లూరు సహ నిర్మాత. పాన్ ఇండియా చిత్రంగా అన్ని దక్షిణాది భాషలు, హిందీలో డిసెంబర్ 22న విడుదల కానుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్