Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

శంకర్ పిక్చర్స్ సమర్పణలో సాయి తేజ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సాయి రామ్ శంకర్, యషా శివకుమార్ జంటగా నవీన్ రెడ్డి దర్శకత్వంలో దేవరాజ్ పొత్తూరు నిర్మిస్తున్న చిత్రం “వెయ్ దరువెయ్”. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో సినీ ప్రముఖుల మధ్య అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన శర్వానంద్ హీరో, హీరోయిన్ లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా,  అల్లరి నరేష్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. విశ్వక్ సేన్ గౌరవ దర్శకత్వం వహించారు.

పూజా కార్యక్రమాల అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటుచేసిన పాత్రికేయులు సమావేశంలో హీరో సాయి రామ్ శంకర్ మాట్లాడుతూ… ఈ కార్యక్రమానికి వచ్చిన హీరోలు శర్వానంద్, అల్లరి నరేష్, విశ్వక్ సేన్ లకు పెద్దలకు ధన్యవాదాలు.”యస్.ఆర్ కల్యాణ మండపం” తర్వాత శంకర్ పిక్చర్స్ తో దేవరాజ్ పొత్తూరు నిర్మిస్తున్న మాస్ ఎంటర్ టైనర్ “వెయ్ దరువెయ్”.  “బంపర్ ఆఫర్” తర్వాత అలాంటి బాడీ లాంగ్వేజ్ ఉన్న కథ లభించడం నా అదృష్టం . ఈ కథ నాకు 100% సక్సెస్ ఫుల్ సినిమా అవుతుందని అనిపిస్తుంది. ఫుల్ ఔట్ ఔట్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ టైటిల్ లోనే మాస్ కనిపిస్తుంది.

“లవ్, యాక్షన్, సెంటిమెంట్ ఉన్న ఈ సినిమా నాకు చాలా మంచి సినిమా అవుతుంది. ఈ సినిమాకు భీమ్స్ మ్యూజిక్, సతీష్ ముత్యాల డి ఓ పి ఇస్తున్నారు.ఈ సినిమాతో యషా శివకుమార్ హీరోయిన్ గా పరిచయ మవుతుంది. తను కన్నడ లో శివరాజ్ కుమార్ తో చేసిన సినిమా రిలీజ్ కు రెడీ గా ఉంది. తన క్యారెక్టర్ కూడా నాకు ఈక్వల్ గా ఉంటుంది. నాకింత మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. ఈ సినిమాను సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చేయడానికి ప్లాన్ చేసి ఈ సంవత్సరం లోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు” అన్నారు.

Also Read : సాయిరామ్ శంకర్ ‘ఒక పథకం ప్రకారం’టీజర్

 

Leave a Reply

Your email address will not be published.

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com