Saturday, November 23, 2024
HomeTrending Newsసిపిఎస్ పై త్వరలో నిర్ణయం :సజ్జల

సిపిఎస్ పై త్వరలో నిర్ణయం :సజ్జల

ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి పూర్తి అవగాహన ఉందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రష్ణారెడ్డి అన్నారు. పదవీ విరమణ పొందిన ఏపీ ఎన్జీవో నేత చంద్రశేఖర్‌రెడ్డి సన్మాన కార్యక్రమంలో సజ్జల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీపీఎస్‌ రద్దు చేసే అంశం సంక్లిష్టమైన సమస్య అని, అందుకే ఆలస్యమైందని, అతి త్వరలో దీని పరిష్కారానికి సీఎం కృషి చేస్తున్నారని చేప్పారు. ఒకేసారి లక్షా 30 వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్‌ కే దక్కుతుందని సజ్జల అన్నారు. ఉద్యోగుల సమస్యలపై సానుకూలంగా స్పందిస్తున్నామని, సీఎం జగన్ స్పష్టతతో విప్లవాత్మక కార్యక్రమాలు చేస్తున్నారని గుర్తుచేశారు.

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే విషయంలో నాడు వైఎస్సార్‌కు ఉన్న విజన్ ఇప్పుడు సీఎం జగన్‌కు ఉందని గుర్తుచేశారు. సీఎం జగన్ ముఖ్యమంత్రి అయ్యేనాటికి రాష్ట్రం అప్పుల్లో ఉందని,గత ప్రభుత్వం 2లక్షల 60 వేల కోట్లు అప్పులు చేసి వెళ్లిందని మండిపడ్డారు. పాలన గాడిన పడేలోపే కరోనా సంక్షోభం వచ్చిందని,  అయినా సంక్షేమ పాలన అందిస్తున్నామని తెలిపారు. సర్వీస్ మ్యాటర్స్ నుండి ఫైనాన్షియల్ ఇష్యూస్ వరకు అన్ని క్లియర్ చేస్తామని తెలిపారు. చరిత్రలో ఒకేసారి లక్షా ముప్పై వేల రెగ్యులర్ ఉద్యోగాలు ఇచ్చింది సీఎం జగన్‌ ప్రభుత్వం మాత్రమేనని అన్నారు.

చంద్రశేఖర్ రెడ్డిని ఉద్యోగులకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నియమిస్తామని, త్వరలో దానికి సంబంధించిన జీవోను కూడా విడుదల చేస్తామన్నారు.  ఈ కార్యక్రమంలో మంత్రి వెల్లంపల్లి,  ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ గౌతమ్ రెడ్డి, ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్