Friday, April 19, 2024
HomeTrending Newsబాబువి నీచ రాజకీయాలు: సజ్జల ధ్వజం

బాబువి నీచ రాజకీయాలు: సజ్జల ధ్వజం

Flood Politics: వరద ప్రాంతాలకు తక్షణ వరద సాయం అందించడం తమ ప్రభుత్వ హాయంలోనే మొదలయ్యిందని, గత చంద్రబాబు హయాంలో ఎప్పుడైనా ఇలా చేశారా అని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. కొత్త జిలాల పెంపు, గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థతో పరిపాలనను వికేంద్రీకరించామని, దీని ద్వారా ఇలాంటి విపత్తుల సమయంలో వెంటనే సహాయక చర్యలు చేపట్టేందుకు అవకాశం ఏర్పడిందని వివరించారు.  12వ తేదీనే సిఎం జగన్ సమీక్ష జరిపి ఆరు జిల్లాలకు నిధులు విడుదల చేస్తూ జీవో జారీ చేశారన్నారు. ఆ తరువాత బాధితులకు వెయ్యి నుంచి రెండు వేల రూపాయల సాయం కోసం కూడా నిధులు విడుదల చేస్తూ మరో జీవో కూడా ఇచ్చారన్నారు. నాలుగు ఆలుగడ్డలు, నాలుగు టమాటాలు అంటూ ఓ ఫోటో పెట్టి ట్వీట్ చేయడం బాబు సిగ్గులేని రాజకీయాలకు నిదర్శనమని ఘాటుగా వ్యాఖ్యానించారు. ‘వ్యవస్థ నడవాలి- వ్యవస్థ కదలాలి, దాన్ని అవసరమైనట్లు అప్రమత్తం చేయాలి, దానికి అవసరమైన వనరులు సమకూర్చాలి, ఇంకా ఏమైనా అవసరమైతే అడగండి నేనున్నా’ అని చెప్పడం సిఎం జగన్ ఉద్దేశమని పేర్కొన్నారు.

చంద్రబాబునాయుడు కష్టపడి అధికారం లోకి రాలేదని, మామను వెన్నుపోటుపొడిచి సిఎం అయ్యారని అందుకే పదవి, అధికారం అనేది తన హక్కు అని అయన ఎప్పుడూ అనుకుంటారని సజ్జల విమర్శించారు. వరద ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన కేవలం పబ్లిసిటీ కోసమే నన్నారు.  మీడియా ప్రచార యావ కోసమే ఆయన తాపత్రయమన్నారు.  ఏ ఒక్కరైనా తమకు సాయం అందలేదని చెప్పారా అని సజ్జల ప్రశ్నించారు. కొంతమందిని ముందే ప్రిపేర్ చేసి వారితో ప్రభుత్వంపై విమర్శలు చేయించడం ఆయనకు అలవాటయ్యిందని  అన్నారు.

చంద్రబాబు సిఎంగా ఉన్నప్పుడు కూడా వరదల సమయంలో అర్ధరాత్రి వరకూ సమీక్షలు అంటూ హంగామా చేసేవారని, సహాయ చర్యల్లో ఉండాల్సిన  యంత్రాంగాన్ని ఆ పని చేయనీయకుండా ఈయన అక్కడకు వెళ్ళి వాళ్ళ కాళ్ళకు అడ్డం  పడేవారని  సజ్జల దుయ్యబట్టారు.

Also Read ఆర్ధిక వ్యవస్థపై విష ప్రచారం: సజ్జల, దువ్వూరి 

RELATED ARTICLES

Most Popular

న్యూస్