వి.జే సన్నీ, శ్రీ తేజ్, ఆషిమా నర్వాల్, తరుణీ, నటీనటులుగా వెలిగొండ శ్రీనివాస్ దర్శకత్వంలో E.I.P.L పతాకంపై సంజీవ రెడ్డి  నిర్మిస్తున్న చిత్రం “సకల గుణాభి రామ”. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర యూనిట్  హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో సినీ  పాత్రికేయుల సమక్షంలో ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర హీరో వి.జే సన్నీ మాట్లాడుతూ.. ‘నా జర్నీ మీడియా నుంచే ప్రారంభమైంది, నేను ఫస్ట్ సీరియల్ ఆర్టిస్ట్ గా పని చేశాను. ఆ తరువాత సినిమా మీద ఇష్టం తో మూవీస్ లోకి వచ్చాను. నేను సినిమాలలోకి రావడానికి హీరో సుశాంత్ సింగ్ రాజపుత్ ఇన్స్పిరేషన్. తను మన మధ్య లేకపోవడం దురదృష్టకరం.

తరువాత నన్ను హీరో గా చేసిన డైరెక్టర్  వెలిగొండ శ్రీనివాస్ గారు నాకు మరో ఇన్స్పిరేషన్ అయనకు నా ప్రత్యేక ధన్యవాదములు, మీడియా నుండి సీరియల్ కు  ఇప్పుడు హీరో గా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.ఈ సినిమాకు వర్క్ చేసిన డి.ఓ.పి నళినీ కాంత్ కెమెరా వర్క్ సూపర్బ్ అని చెప్పవచ్చు, ఇంక మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్  చాలా మంచి సంగీతం ఇచ్చాడు. ఇందులోని యూ ఒక సాంగ్ ఈ ఇయర్ లో ఒక ట్రెండ్ సెట్ చేస్తుంది.. అలాగే నిర్మాత సంజీవ రెడ్డి గారు ఖర్చుకి వెనకాడ కుండా సినిమాను పూర్తి చేశారు. ఈ మూవీ చాలా బాగా వచ్చింది. అందరికీ కచ్చితంగా నచ్చుతుందని అన్నారు.

చిత్ర దర్శకుడు వెలిగొండ శ్రీనివాస్ మాట్లాడుతూ.. “నేను మంచి కాన్సెప్ట్ తో ఈ  కథను తయారు చేసుకొని నిర్మాతలు  సంజీవరెడ్డి గారికి ఈ కథ చెప్పడం జరిగింది. నిర్మాతలకు నేను చెప్పిన కథ నచ్చడంతో  నామీద నమ్మకంతో ఈ మూవీని తమ E.I.P.L బ్యానర్ మీద చెయ్యడానికి ఒప్పుకున్నారు. భార్య భర్తల మధ్య ఎమోషన్స్  రొమాన్స్, కామెడీ నే మా ‘సకల గుణాభి రామ’. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న మా చిత్రాన్ని ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని” అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *