Sunday, September 8, 2024
HomeసినిమాChristmas: క్రిస్మస్ సినిమాలను టెన్షన్ పెడుతున్న'సలార్'

Christmas: క్రిస్మస్ సినిమాలను టెన్షన్ పెడుతున్న’సలార్’

ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సలార్’. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నఈ పాన్ ఇండియా మూవీ సెప్టెంబర్ 28న రిలీజ్ కావాల్సింది కానీ.. వాయిదా పడింది. అంతే.. సెప్టెంబర్ లో రిలీజ్ కావాల్సిన సినిమాల రిలీజ్ డేట్స్ కాస్త ముందు వెనకకు మార్చుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు సలార్ క్రిస్మస్ కు డిసెంబర్ 22న రిలీజ్ కానుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు డిసెంబర్ లో రిలీజ్ కి రెడీ అవుతున్న సినిమాల హీరోలు, దర్శకనిర్మాతలు టెన్షన్ పడుతున్నారు. టాలీవుడ్ లోనే కాకుండా.. బాలీవుడ్ లో కూడా టెన్షన స్టార్ట్ అయ్యింది.

నాని నటిస్తున్నమూవీ ‘హాయ్ నాన్న’. ఈ చిత్రానికి నూతన దర్శకుడు శౌర్యవ్ దర్శకత్వం వహిస్తున్నాడు. నానికి జంటగా మృణాల్ ఠాగూర్ నటిస్తుంది. ఈ మూవీ టీజర్ అండ్ సాంగ్ కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మాస్ మూవీ దసరా తర్వాత నాని చేస్తున్న ఈ క్లాస్ మూవీ పై ఆడియన్స్ లో ఇంట్రస్ట్ క్రియేట్ అయ్యింది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 21న విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. ఇప్పుడు సలార్ వస్తుండడంతో నాని ఆలోచనలో పడ్డాడు. కుదిరితే డిసెంబర్ పస్ట్ వీక్ లో సెట్ కాకపోతే సంక్రాంతికి వస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాడట.

వెంకటేష్ నటిస్తున్నపాన్ ఇండియా మూవీ ‘సైంధవ్’. ఈ చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది వెంకీ 75వ చిత్రం కావడంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శ్రీలంకలో షూటింగ్ జరుగుతుంది. ఈ షెడ్యూల్ తో దాదాపు షూటింగ్ పూర్తవుతుంది. శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, నవాజుద్దీన్ సిద్దిఖీ, కోలీవుడ్ స్టార్ ఆర్య తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 22న విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. ఇప్పుడు డిసెంబర్ 22న సలార్ వస్తుండడంతో సైంథవ్ ఆలోచనలో పడ్డాడట. సంక్రాంతికి సైంథవ్ ని రిలీజ్ చేయాలి అనుకుంటున్నాడని టాక్ వినిపిస్తోంది.

నితిన్ నటిస్తున్న మూవీ ‘ఎక్స్ ట్రా’. ఈ చిత్రానికి ఆర్డినరీ అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రానికి వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల సరైన సక్సెస్ లేక సతమతమౌతున్న నితిన్ ఈ సినిమా పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 23న రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు.  ఇప్పుడు సలార్ డిసెంబర్ 22న వస్తుందని వార్తలు వస్తుండడంతో ఈ సినిమాను డిసెంబర్ ఫస్ట్ వీక్ లో రిలీజ్ చేయాలి అనుకుంటున్నారట. టాలీవుడ్ లోనే కాదు.. బాలీవుడ్ లో కూడా సలార్ ఎఫెక్ట్ ఉంది. షారుఖ్ మూవీ ‘డంకీ’ డిసెంబర్ 22న విడుదల అని ప్రకటించారు. ఇప్పుడు సలార్ అదే డేట్ లో వస్తుండడంతో అక్కడ కూడా టెన్షన్ స్టార్ట్ అయ్యింది. మొత్తానికి సలార్ ఎఫెక్ట్ క్రిస్మస్ సినిమాల పై బాగా పడింది. అందుచేత.. ఏ సినిమా ఎప్పుడు రానుందో క్లారిటీ కావాల్సివుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్