Wednesday, June 17, 2026
Homeసినిమాఇటలీలో ప్రభాస్ 'సలార్'..?

ఇటలీలో ప్రభాస్ ‘సలార్’..?

ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ పాన్ ఇండియా మూవీ ‘సలార్‘. ఇందులో ప్రభాస్ కు జంటగా శృతి హాసన్ నటిస్తుంది. ఈ భారీ, క్రేజీ మూవీని హోంబలే సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ప్రభాస్ అభిమానులు సలార్ ఎప్పుడెప్పుడు వస్తుందా..? అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల రామోజీ ఫిలింసిటీలో ప్రభాస్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ చిత్రాన్ని రెండు పార్టులుగా చేయాలి అనుకున్నారు కానీ.. ఇప్పుడు ఒక పార్ట్ గానే తెరకెక్కిస్తున్నారని తెలిసింది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగు ఇటలీలో జరుగుతోందని అంటున్నారు. ప్రభాస్, విలన్ గ్యాంగ్ నేపథ్యంలో వచ్చే భారీ యాక్షన్ సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నట్టుగా సమాచారం. ఈ యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాకి హైలైట్స్ గా నిలవనున్నాయని, ఆడియన్స్ కి థ్రిల్ కలిగించేలా ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు. ఈ షెడ్యూల్ తో ఈ సినిమా షూటింగు 85 శాతం వరకూ పూర్తవుతుందని చెబుతున్నారు. మిగతా భాగాన్ని హైదరాబాద్ లోనే ప్లాన్ చేశారు.  జగపతిబాబు, పృథ్వీ రాజ్ సుకుమారన్ పవర్ ఫుల్ పాత్రలను పోషిస్తున్నారు.

ప్రభాస్ బాహుబలి సినిమాతో సంచలనం సృష్టించడం.. ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ తో సంచలనం సృష్టించడం.. వీరిద్దరూ కలిసి సలార్ చేస్తుండడంతో అభిమానుల్లోనూ కాదు.. బిజినెస్ సర్కిల్లోనూ భారీగా క్రేజ్ ఏర్పడింది. ఇప్పటి వరకు ఉన్న రికార్డులను సలార్ క్రాస్ చేయడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తుంది. ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన తర్వాత ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కనకవర్షం కురిపించడం ఖాయమనే పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ సినిమాను ఈ ఏడాది సెప్టెంబర్ 28వ తేదీన విడుదల చేయనున్నారు. మరి.. ప్రభాస్, ప్రశాంత్ నీల్ ఎలాంటి రికార్డులు సెట్ చేస్తారో చూడాలి.

Also Read : రిలీజ్ కి ముందే రికార్డులు క్రియేట్ చేస్తున్న సలార్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular