Sunday, January 19, 2025
Homeసినిమాసలార్ రన్ టైమ్ లాక్ అయ్యిందా..?

సలార్ రన్ టైమ్ లాక్ అయ్యిందా..?

కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన భారీ పాన్ ఇండియా మూవీ ‘సలార్‘.  దీని ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పటి నుంచి అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక టీజర్ రిలీజ్ చేసిన తర్వాత అయితే.. అంచనాలు ఆకాశాన్ని అంటాయి. సలార్ ట్రైలర్  విడుదలకు కూడా రంగం సిద్ధమవుతోంది.

సలార్ రన్ ట్రైలర్ 2 నిమిషాల 37 సెకన్స్ ఉంటుందని సెప్టెంబర్ 7న ట్రైలర్ రిలీజ్ అని ప్రచారం జరిగింది. ఇప్పుడు అంత కంటే ముందుగానే సెప్టెంబర్ 3న రిలీజ్ ఉంటుందని టాక్ వినిపిస్తుంది. అతి త్వరలోనే మేకర్స్ ట్రైలర్ రిలీజ్ పై క్లారిటీ ఇవ్వనున్నారు. ట్రైలర్ తోనే ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారట.

ఇందులో ప్రభాస్ కు జంటగా శృతిహాసన్ నటిస్తే.. కీలక పాత్రల్లో పృధ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు నటించారు. ఎవరెన్ని అంచనాలతో వచ్చినా ఖచ్చితంగా అందర్నీ ఆకట్టుకునేలా ఈ సినిమా ఉంటుందని మేకర్స్ గట్టిగా చెబుతున్నారు. సెప్టెంబర్ 28న ఈ భారీ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.

Also Read: Salaar Trailer: సలార్ ట్రైలర్ కు ముహూర్తం కుదిరిందా..?

RELATED ARTICLES

Most Popular

న్యూస్