పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘రాధేశ్యామ్’నిరాశపరచడంతో సలార్ పై చాలా ఆశలు పెట్టుకున్నారు అభిమానులు. దీనికి తోడు కేజీఎఫ్ 2 మూవీతో ప్రశాంత్ నీల్ సెన్సేషన్ క్రియేట్ చేయడంతో సలార్ పై అంచనాలు ఇంకా పెరిగాయి. సలార్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు కానీ.. టీజర్ రిలీజ్ చేయలేదు. మే నెలలో సలార్ షూటింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి టీజర్ వచ్చేస్తుంది అని టాక్ మొదలైంది. సలార్ టీమ్ కూడా టీజర్ వచ్చేస్తుందన్నారు కానీ.. ఎప్పుడనేది క్లారిటీ ఇవ్వలేదు.
ప్రభాస్ బర్త్ డే అక్టోబర్ లో. అప్పటివరకు టీజర్ రాదని ప్రచారం జరిగింది. అయితే.. ఇప్పుడు టీజర్ రెడీ అయ్యిందన్న న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీంతో ప్రభాస్ మాస్ కటౌని చూడాలని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రభాస్ అభిమానుల కోరిక మేరకు ఆగష్టులో సలార్ టీమ్ టీజర్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తుందట. ఈ మూవీని వచ్చే సంవత్సరం సమ్మర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Also Read : ప్రభాస్ మూవీలో యశ్?